నగరానికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో మూడు సరికొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించింది. కోకాపేట్ నియోపోలిస్, మంచిరేవుల, తెల్లాపూర్‌లో మూడు అత్యాధునిక ఆకాశహర్మ్యాల్ని ఆరంభించింది. ఆలా ఆరంభించిందో లేదో ఇలా ఫ్లాట్ల అమ్మకాలూ మెరుగ్గానే జరిగాయి. ఇంతకీ సంస్థ మొదలెట్టిన కొత్త ప్రాజెక్టులేవి.. వాటి పూర్తి వివరాలు.. రియల్ ఎస్టేట్ గురు పాఠకుల కోసం ప్రత్యేకం..
కోకాపేట్ నియోపోలిస్‌లో రాజాపుష్ప కాసా లగ్జూరా అనే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టును సుమారు ఏడు పాయింట్ ఏడు ఐదు ఎకరాల్లో నిర్మిస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ నిర్మాణంలో ఐదు టవర్లను కడుతోంది. నాలుగు బేస్‌మెంట్లు, స్టిల్ట్‌తో పాటు 51 అంతస్తుల ఎత్తులో ఈ ప్రాజెక్టును మొదలెట్టింది. ఇందులో వచ్చేవి మొత్తం 612 ఫ్లాట్లు కాగా.. ప్రతి ఫ్లోరుకు 2 మరియు మూడు ఫ్లాట్లను మాత్రమే డిజైన్ చేసింది. ఒక్క క్లబ్ హౌజునే సుమారు అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తోంది. ప్రతి టవర్ మీద రూఫ్‌టాప్ ఎమినిటీస్‌ను డిజైన్ చేసింది.
రెరా అనుమతి పొందిన రాజపుష్స ఔరేలియాను సంస్థ సుమారు పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల్లో అభివృద్ధి చేస్తోంది. ఇందులో వచ్చేవి సుమారు ఏడు టవర్లు. మొత్తం కట్టేవి 1561 ఫ్లాట్లు. మూడు మరియు నాలుగు బేస్‌మెంట్లతో పాటు స్టిల్ట్ ప్లస్ 56 అంతస్తుల ఎత్తులో ఈ ప్రాజెక్టును రాజపుష్ప డిజైన్ చేసింది. జి ప్లస్ 6 అంతస్తుల ఎత్తులో క్లబ్ హౌజ్‌ను ఏర్పాటు చేస్తోంది. స్టిల్ట్ లెవెల్‌లో 50 వేల చదరపు అడుగులు, మరో 70 వేల చదరపు అడుగుల్లో కలిపి మొత్తం ఎమినిటీస్‌ను డెవలప్ చేస్తోంది. ప్రతి ఫ్లోరుకు వచ్చేవి కేవలం నాలుగు ఫ్లాట్లే కావడం గమనార్హం.
నార్సింగి మంచిరేవులలో రాజపుష్ప ఇన్‌ఫినా ప్రాజెక్టులో.. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్ల విస్తీర్ణం మూడు వేల ఎనభై చదరపు అడుగులుండగా.. ఫోర్ బీహెచ్‌కే మూడు వేల ఏడు వందల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఇందులోనే మేడ్ రూముతో కలపి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు చదరపు అడుగులు మరియు ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు చదరపు అడుగుల్లో ఫ్లాట్లను డిజైన్ చేశారు. క్లబ్ హౌజ్ విషయానికి సుమారు అరవై వేల చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తున్నారు. సరిగ్గా గండిపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ చేరువలోనే డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఇరవై నిమిషాల్లో వెళ్లిపోవచ్చని గుర్తుంచుకోండి. మరెందుకు ఆలస్యం.. ఈ మూడు ప్రాజెక్టుల్లో ఏదో ఒక ప్రాజెక్టుకు మీరు ఎంచక్కా ఎంచుకోండి.. సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించండి.