నటి సన్యా ఠాకూర్
ఇంట్లో ఎంత కాస్ట్ లీ డెకరేషన్ ఉంది అనే అంశం కంటే ఎంత ఓపెన్ ఏరియా ఉన్నది అనేదే ముఖ్యమని స్పై గర్ల్ సన్యా ఠాకూర్ పేర్కొన్నారు. సొంతింటికి సంబంధించిన పలు అంశాలను ఆమె పంచుకున్నారు. ‘నేను ఇంకా ఇల్లు కొనలు. కానీ త్వరలోనే కొంటానని అనుకుంటున్నాను. నా చిన్ననాటి జ్ఞాపకాలు మా మొదటి ఇంట్లోనే ఉన్నాయి. అక్కడ నా తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఎంతో ఆనందంగా జీవించాం. అక్కడ అతిపెద్ద ఆకర్షణ సింగిల్ విండో, ప్లే గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో అందరూ కలిసి ఎంతో ఎంజాయ్ చేసేవాళ్లం. ఇంకా ఇండియన్ జుజుబ్ మొక్కలను తీసుకుని ఎవరికీ తెలియకుండా తినేవాళ్లం. నాకు కూడా టెర్రస్ అంటే చాలా ఇష్టం’ అని చెప్పారు.
మొక్కలు, పూలతో నిండిన చిన్న తోటలో ఓ చిన్న టెర్రస్ తో కూడిన మనోహరమైన ఇల్లు తదమని సన్యా ఠాకూర్ వెల్లడించారు. ‘నాకు రిచ్ డెకర్ నచ్చదు. మా ఇల్లు సింపుల్ గా, పచదనంతో నిండి ఉంటుంది. అది నాకు ఎంతో ఆనందనాన్నిచ్చేది. పచ్చదనం, కొంత ఖాళీ స్థలం ఉండటం నాకు అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. లగ్జరీ డెకరేషన్ కంటే ఓపెన్ ఏరియా చాలా అవసరం అనేది నా అభిప్రాయం’ అని పేర్కొన్నారు. హృతిక్ రోషన్ తో కలిసి సూపర్ 30లో నటించిన సన్యా తన గురించి మరిన్ని వివరాలు చెప్పారు. ‘మాకు బంగ్లా ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉండేది. లోలపకు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండే బంగ్లా.. చుట్టూ బోలెడు మొక్కలున్న తోట.. అందులో నేను తోటమాలిగా పనిచేయాలనేది నా ఆకాంక్ష. మారు ఓ ఇల్లు ముంబైలో ఉంది. మరొకటి రిషికేశ్ లో ఉంది. ఎందుకంటే అమ్మకు రిషికేశ్ అంటే ఇష్టం. నాకు ముంబై అంటే ఇష్టం. నా జీవితంలో ఎక్కువ భాగం గడిపింది ముంబైలోనే కాబట్టి నేను ఇక్కడ తప్ప మరెక్కడా ఉండలేను‘ అని వివరించారు.
తన ఖాళీ స్థలం ముందు ఎలాంటి భవనం తనకు అక్కర్లేదని ఆమె స్పష్టంచేశారు. తనకు సరైన సహజ వెలుతురుతో కూడిన ఓపెన్ ఏరియాలు కావాలని పేర్కొన్నారు. ‘ఒక పెద్ద బాత్రూమ్, వంటగది, అలాగే తోట వంటి ఓపెన్ ఏరియా.. ఇవే నేను గడిపే ప్రాంతాలు. నా సమయం చాలా ఎక్కువ. నేను ఇటీవల పంకజ్ త్రిపాఠి ఇంటిని చూశాను. అది నాకు భలే నచ్చేసింది. అది ఉత్తరాది ఇల్లు అనే భావం కలిగిస్తుంది. నాకు అలాంటి ఇల్లు కావాలి. పెద్ద కిటికీలతో సింపుల్ గా కానీ అందంగా ఉండే ఇల్లు కావాలి’ అని సన్యా ఠాకూర్ తన మనసలో మాట బయటపెట్టారు. కోవిడ్ తర్వాత ప్రస్తుతం తాను ఎంతో బాగున్నానని. కానీ హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు కష్టపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ముంబైలో లాస్ ఏంజెలెస్ ధరలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెరుగుతున్న హైప్ ని సాధారణీకరించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి కోసం కలలు కనే సాహసం కూడా చేయలేకపోతున్నారన్నారు. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇది చాలా సవాల్ గా ఉందని, కానీ మనమేం చేయగలమని ప్రశ్నించారు. మనం ఉన్నత జీవన ప్రమాణాలతో కూడిన అభివృద్ధి చెందిన దేశంలో జీవిస్తున్నామని, అందువల్ల మనం మరింతగా సుసంప్పనం కావాలని పేర్కొన్నారు.