poulomi avante poulomi avante

ప్రకృతి మధ్యలో పెద్ద బాల్కనీతో ఇల్లు కావాలి

రియల్ ఎస్టేట్ గురుతో
సేవ్ ది టైగర్స్ నటి దేవియాని శర్మ

నటి దేవియాని శర్మ.. సైతాన్ అయినా, సేవ్ ది టైగర్స్ అయినా.. ఇప్పుడు సేవ్ ది టైగర్స్-2 అయినా తాను చక్కని నటి అని నిరూపించుకున్నారు. గ్లామరస్ తోపాటు డి-గ్లామ్.. ఎలాంటి పాత్ర అయినా సరే అందులో చక్కగా ఒదిగిపోతున్నారు. తాజాగా ఆమె తన కలల ఇల్లు ఎలా ఉండాలి అనే అంశంపై రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రకృతికి దగ్గరగా, హాయిగా చదువుకునేందుకు చక్కని రీడింగ్ కార్నర్లు, పెంపుడు శునకాల కాసం కాస్త స్థలంతో కూడిన ఇల్లంటే ఇష్టమని చెప్పారు. వివరాలు ఆమె మాటల్లోనే..

పచ్చని చెట్ల మధ్య..

‘నేను రియల్ ఎస్టేట్ కథనాలు చదువుతూ ఉంటాను. వాటిని అందరితో పంచుకుంటూ ఉంటాను. అందువల్ల నాకు కూడా కలల ఇల్లు కావాలి. నా కలల సౌథం చాలా పెద్ద కల వంటిదే. నేను చాలా మినిమలిస్ట్ వ్యక్తిని. నాకు మట్టి, జెన్ థీమ్ లతో కూడిన ఇల్లంటే ఇష్టం. ఎందుకంటే నేను విశ్వం, ప్రకృతితో అనుసంధానమైన వ్యక్తిని. పచ్చదనం ఎక్కువగా ఉండే ప్రదేశంలో నా కలల సౌథం ఉండాలని కోరుకుంటన్నాను.

మట్టి ఇంటీరియర్స్..

మట్టితో కూడిన ఇంటీరియర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నా డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలి అనేదానిపై నా దగ్గర చాలా చిత్రాలు ఉన్నాయి. నా మొబైల్ గ్యాలరీ, నా ఇన్ స్టా గ్రామ్ లో అన్నీ అవే ఉంటాయి. నాకు జెన్, ఎర్తీ రంగులు కావాలి. నాకు లేత ఆకుపచ్చ, తెలుపు,, ఎర్తీ పాస్టల్ కలర్స్ అంటే ఇష్టం.

పెద్ద బాల్కనీ ఉండాల్సిందే..

నాకు బాల్కనీలంటే చాలా ఇష్టం. మంచి బాల్కనీ లేకుండా ఇల్లు పూర్తికాదనేది నా నమ్మకం. నా కలల సౌథంలో సూర్యోదయం సమయంలో బాల్కనీలో కూర్చుని ధ్యానం చేస్తూ సమయం గడపాలనేది నా ఆకాంక్ష. సేవ్ ది టైగర్స్ లో నా సహ నటి పావనికి అందమైన ఇల్లు.. అందులో ఇంకా అందమైన బాల్కనీ ఉన్నాయి. అలాంటిదే నా కలల ఇంట్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె ఇల్లు చాలా అందంగా ఉంది.

చక్కని రీడింగ్ కార్నర్..

నేను చదవడం, రాయడం, పెయింటింగ్ వేయడం ఇష్టపడతాను. అందువల్ల నా పెయింటింగ్ వస్తువులు, లైబ్రరీ, కాఫీ టేబుల్ ఉంచడానికి నా ఇంట్లో చక్కని రీడింగ్ కార్నర్ కావాలి. నేను మరింత కళాత్మకంగా మారడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది.

నగర జీవిని కాను..

వాస్తవానికి నేను నగర జీవిని కాను. నగర జీవితంలో చాలా గందరగోళ ఉంది. గోవాను నా ఇంటిగా భావిస్తాను. నాకు కాస్త అలసట అనిపించినప్పుడు, విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు గోవా వెళ్లి బీచ్ లో సేద తీరతాను. ప్రకృతితో మమేకం కావడం నాకు చాలా ఇష్టం. బీచ్ లు, పర్వతాలు, పచ్చదనం ఉన్న ప్రతిచోటా నేను ఉంటాను. ప్రస్తుతం నా దృష్టంతా సరైన మొత్తంలో డబ్బు సంపాదించడంపైనే ఉంది. నాకు కావాల్సిన డబ్బు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడతాను.

పెంపుడు శునకాల కోసం..

నా ఇంట్లో బుద్ధుడి విగ్రహంతోపాటు చిన్న ఫౌంటెయిన్ కా ఉండాలి. అందులోని నీటి సవ్వడి వినడం నాకు చాలా ఇష్టం. నా పెంపుడు శునకాలు, పక్షుల కోసం ప్రత్యేకంగా స్థలం ఉండాలి. నాకు కుక్కలంటే చాలా ఇష్టం. వాటికోసం ప్రత్యేక స్థలం ఉండాలని కోరుకుంటున్నాను. ఢిల్లీలో నాకు రెండు కుక్కలున్నాయి’.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles