పశ్చిమ హైదరాబాద్లో మై హోమ్ ( MY Homes ) గ్రూపు మరో బడా ఆకాశహర్మ్యానికి శ్రీకారం చుట్టింది. మై హోమ్ త్రిదాసా అని నామకరణం చేసిన ఈ ప్రాజెక్టును తెల్లాపూర్లో ఆవిష్కరించింది. సుమారు 22.56 ఎకరాల్లో.. జి ప్లస్ 29 అంతస్తులో తొమ్మిది టవర్లను నిర్మిస్తుంది. ఇందులో రెండు పడక గదుల ఫ్లాట్లను 1253 చదరపు అడుగుల్లో కడుతోంది. 2.5 పడక గదుల ఫ్లాట్లను 1505 చ.అ., త్రీ బెడ్ రూం ఫ్లాట్లను 1840 చ.అ.ల విస్తీర్ణంలో డిజైన్ చేశారు. మొత్తానికి 2,682 ఫ్లాట్లను ఇందులో నిర్మిస్తున్నారు.
మై హోమ్ సంస్థ ఎప్పటిలాగే సెంట్రల్ పార్కును ఇందులో డిజైన్ చేసింది. చిల్డ్రన్ ప్లే ఏరియాకు పెద్దపీట వేసింది. ప్రతి టవర్ మధ్యలో వంద అడుగుల దూరముండేలా ప్లాన్ చేశారు. ప్రతి టవర్లో ఎంట్రెన్స్ లాబీని డిజైన్ చేశారు. నిర్మాణం వచ్చేది 16 శాతం స్థలంలోనే మిగతా 84 శాతాన్ని ఓపెన్ స్పేస్ గా వదిలేశారు.
నివాసితుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్లబ్ హౌజును 52 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తోంది. ఔట్ డోర్ ప్లే కోర్టును డెవలప్ చేస్తోంది. స్విమ్మింగ్ పూల్, జిమ్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, తివాచీ పర్చిన పచ్చదనానికి పెద్దపీట వేశారు. ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులు, ఫుడ్ కోర్టు, స్పా, సెలూన్, క్రెష్, ఫార్మసీ, హెల్త్ కేర్, స్క్వాష్ కోర్టు వంటి వాటికి స్థానం కల్పించింది. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.