ప్రీలాంచ్ పేరిట మరో భారీ మోసం వెలుగులోకి
రియల్ రంగంలో పారదర్శకత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. మోసాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా హైదరాబాద్ లో మరో ప్రీలాంచ్ మోసం వెలుగు చూసింది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో జీఎస్‌ఆర్ ఇన్ ఫ్రా కంపెనీ బాధితుల నుంచి రూ.వంద కోట్లకు పైగా వసూలు చేసి వారికి కుచ్చుటోపీ పెట్టింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు సీసీఎస్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కొల్లూరు, మోకిల, అబ్దుల్లాపూర్‌మెట్, యాదాద్రి ప్రాంతాలలో భారీ వెంచర్లు ఉన్నాయంటూ ప్రచారం చేసి, మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి పెట్టుబడుల పేరుతో సంస్థ ఎండీ శ్రీనివాసరావు కోట్ల రూపాయలు వసూలు చేశారని బాధితులు తెలిపారు.
2020 నుంచి డబ్బులు వసూలు చేశారని.. మూడేళ్లు పూర్తయినా ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఎండీ శ్రీనివాసరావు తప్పించుకొని తిరుగుతున్నాడని మండిపడ్డారు. వందలాది మంది నుంచి దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని పేర్కొన్నారు. గత మూడు నెలల నుంచి తిరిగి డబ్బులు చెల్లిస్తానంటూ చెప్పిన శ్రీనివాస్‌రావు, రెండు నెలల నుంచి కనబడకుండా పోవడంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.