poulomi avante poulomi avante

టాప్ 30 టైర్-2 నగరాల్లో విజయవాడ, విశాఖ..

  • 10, 11వ స్థానాల్లో తెలుగు నగరాలు
  • తొలి స్థానంలో నాగ్ పూర్

దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న టైర్-2 నగరాల జాబితాలో విజయవాడ, విశాఖపట్నం చోటు దక్కించుకున్నాయి. వివిధ పారామితుల ఆధారంగా కొలియర్స్ ఇండియా దేశంలోని టాప్-30 టైర్-2 నగరాల జాబితా విడుదల చేసింది. ఇందులో విజయవాడ 10వ స్థానంలో ఉండగా.. విశాఖపట్నం 11వ స్థానంలో ఉంది. తొలి మూడు స్థానాల్లో నాగ్ పూర్, జైపూర్, లక్నోలు ఉన్నాయి. సూరత్, కొచి నాలుగు, ఐదు స్థానాల్లో ఉండగా.. పాట్నా, ఆగ్రా, భోపాల్, చండీగఢ్ లు ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో నిలిచాయి. తలసరి ఆదాయం విషయంలోనూ నాగ్ పూర్ అగ్రస్థానంలో నిలిచింది.

గాంధీ నగర్, మంగళూరు, తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ విషయంలో విజయవాడ 11వ స్థానంలో ఉండగా.. విశాఖపట్నం 17వ స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల పెరుగుదల, స్మార్ట్ సిటీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, జనాభా విస్తరణ, అభివృద్ధి చెందుతున్న మైక్రో మార్కెట్లు, ప్రధాన నగరాలతో కనెక్టివిటీ, పెట్టుబడి అవకాశాల వంటివి ఆయా నగరాల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయా సౌకర్యాలను బట్టి వచ్చే పదేళ్లలో ఏయే నగరంలో భూముల రేట్లు ఎన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందో కూడా కొలియర్స్ నివేదిక అంచనా వేసింది. ఇందులోనూ నాగ్ పూర్ దే హవా కొనసాగింది. ఇక్కడ భూముల రేట్లు వచ్చే పదేళ్లలో 5.2 రెట్లు పెరగనున్నట్టు పేర్కొంది. అహ్మదాబాద్ లో 4.5, ఆగ్రాలో 4, జైపూర్, లక్నోల్లో 3.4, మీరట్ లో 3, చండీగఢ్ లో 2.7, భోపాల్ లో 2.5 రెట్ల మేర రేట్లు పెరగనున్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles