-
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
-
నరెడ్కో వెస్ట్ జోన్ సంఘ సమావేశం
-
హైడ్రాకు పూర్తి మద్ధతు: నరెడ్కో వెస్ట్ జోన్
సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా పని చేస్తుందని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. సంఘ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, సూచనల్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పశ్చిమ హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు దురాక్రమణలకు గురి కాకుండా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకోవాలని కోరారు. హైడ్రాను స్వాగతిస్తూ ఆక్రమణల నుండి ప్రభుత్వ ఆస్తులను, చెరువులను రక్షించే విషయంలో అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు.
సెక్రటరీ కె. వి .ప్రసాద్ రావు మాట్లాడుతూ.. హైడ్రా పరిధిని విస్తరించి అక్రమ కట్టడాలను నివారించాలని కోరారు. నరెడ్కో తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ సత్యం శ్రీరంగం మాట్లాడుతూ.. బిల్డర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నరెడ్కో వెస్ట్ జోన్ ఛైర్మన్ ఎం. ప్రేమ్ కుమార్, ట్రెజరర్ కె. సుభాష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరావు, మన్నే రవి, నార్నే శ్రీనివాసరావు, నరేంద్ర ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.