poulomi avante poulomi avante

ఎఫ్‌టీఎల్‌ నిర్ధార‌ణలో రేవంత్ సర్కార్?

గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులను, కంటలను, నాలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా. బడాబాబుల నుంచి మొదలు సామాన్యుల వరకు ఎవరు ఆక్రమణలకు పాల్పడ్డా బుల్డోజర్ తో ఎంటరవుతోంది హైడ్రా. అయితే హైడ్రా పై కొంద‌రు న్యాయస్థానాలను ఆశ్ర‌యిస్తుండ‌టంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే హైడ్రాకు చట్టబద్దత కల్పించే ఆర్డినెన్స్ ను తీసుకురానున్న‌ది రేవంత్ సర్కార్.

దీంతో పాటు గతంలో ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం చెరువులను సంబంధించిన‌ ఫుల్ ట్యాంక్ లెవల్-ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడంతో ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. పైగా న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్నాయి. అందుకే గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువుల ఎఫ్టీఎల్ పై మరోసారి సర్వే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

చెరువులకు సంబంధించిన‌ తాజా ఎఫ్టీఎల్ ను నిర్ధారించాలని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం. దీంతో వెంటనే రంగంలోకి దిగారు కరెక్టర్లు. ఒకవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల్లోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తుండగా, మరోవైపు ఔటర్‌ రింగ్‌ రోడ్డు బయట చెరువులకు ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించి, నోటిఫికేషన్లు జారీ చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఇప్పటికే 71 చెరువులకు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి, ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు.. ఆయా చెరువుల ఎఫ్‌టీఎల్‌ వివరాలతో పాటు అందుకు సంబంధించిన‌ మ్యాప్‌లను కూడా జత చేసి హెచ్‌ఎండీఏకి పంపించారు. వీటిని నోటిఫై చేసి అభ్యంతరాలుంటే 30 రోజుల్లో తెలపాలని హెచ్‌ఎండీఏ కోరింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 2010లో చెరువులు, ఇతర నీటి వనరులను సంరక్షించడానికి ఏర్పాటైన లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ పూర్తి స్థాయిలో పని చేయలేదు. ఈ కమిటీ నీటివనరుల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లను గుర్తించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయాలి. 30 రోజుల్లో అభ్యంతరాలను స్వీకరించి తుది నోటిఫికేషన్‌ జారీ చేయాలి. అనంతరం రక్షణ చర్యలు చేపట్టాలి. కానీ గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని చెరువులవి మాత్రమే తుది నోటిఫికేషన్‌ వరకు వచ్చాయి.

ప్రాథమిక నోటిషికేషన్‌ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం నీటివనరుల్లో ఆక్రమణలు తొలగించి వాటిని రక్షించడంతో పాటు ఎఫ్‌టీఎల్‌ను నిర్థారించే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నదులతో పాటు చెరువులు, లేక్‌లు, ఇతర నీటి వనరుల్లో ఎఫ్‌టీఎల్‌ వరకు ఎలాంటి నిర్మాణాలను అనుమతించరాదని 2012, 2016లో మునిసిపల్ శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ లోనూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, బఫర్‌ జోన్‌లు రిక్రియేషన్‌కు సంబంధించినవి మాత్రమేనని స్పష్టం చేసింది.

2016లో మున్సిప‌ల్‌ శాఖ ఇచ్చిన జీవో-7 ప్రకారం నీటిపారుదల, రెవెన్యూ శాఖలు ఈ సరిహద్దును నిర్ణయించాలి. మున్సిప‌ల్‌ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, హెచ్‌ఎండీఏ ప్రాంతాల్లో నది సరిహద్దుకు 50 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ ఉంటుంది. పది హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న లేక్‌లు, చెరువులు, కుంటల్లో ఎఫ్‌టీఎల్‌ నుంచి 30 మీటర్ల వరకు బఫర్‌జోన్‌ ఉంటుంది. ఈ 30 మీటర్లలో 12 అడుగుల మేర వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.

పది హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణమున్న నీటి వనరులకు తొమ్మిది మీటర్ల వరకు బఫర్‌జోన్‌ ఉంటుంది. 10 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న కాలువలు, వాగులు, నాలాలు మొదలైన వాటికి నిర్ణయించిన సరిహద్దు నుంచి తొమ్మిది మీటర్లు, పది మీటర్ల వరకు వెడల్పు ఉంటే రెండు మీటర్ల బఫర్‌ జోన్‌ ఉంటుంది.

ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులను మ్యాప్‌ల ఆధారంగా నీటిపారుదలశాఖ గుర్తించి, సర్వే నంబర్ల ఆధారంగా రెవెన్యూ శాఖ పరిశీలించి సర్టిఫై చేయాలి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న 71 చెరువులకు ఆయా జిల్లాల కలెక్టర్ల నివేదికల ఆధారంగా ఈ నెలలోనే ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో ఏడు, సంగారెడ్డి జిల్లాలో పది, సిద్దిపేట జిల్లాలో 20, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 27, యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఐదు చెరువులు ఉన్నాయి.

ఈ నెలాఖరు కల్లా గ్రేటర్ పరిధిలోని చెరువులకు సంబందించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ ను నిర్ధారించి, తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles