poulomi avante poulomi avante

హఫీజ్ పేట్లో.. వాసవి లేక్ సిటీ

  • 17.5 ఎకరాలు- 13 టవర్లు
  • మొత్తం ఫ్లాట్ల సంఖ్య: 1845
  • 1225 – 2250 చ.అ.ల్లో ఫ్లాట్లు
  • 2023 జులైలో పూర్తి చేస్తారు

హైదరాబాద్లోని హఫీజ్ పేట్ లో వాసవి గ్రూప్ వాసవి లేక్ సిటీ అనే బడా ప్రాజెక్టును నిర్మిస్తోంది. సుమారు పదిహేడున్నర ఎకరాల్లో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టులో పదమూడు టవర్లను డెవలప్ చేస్తోంది. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. 1845. 2020 మార్చి 1న ఆరంభమైన ఈ నిర్మాణాన్ని 2023 జులైలో కొనుగోలుదారులకు అప్పగించేందుకు సంస్థ ప్రణాళికల్ని రచించింది. జీహెచ్ఎంసీ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో ఈస్ట్ బ్లాకులో 6 టవర్లు, వెస్ట్ బ్లాకులో 7 టవర్లను నిర్మిస్తారు. నిర్మాణం ఎత్తు జి ప్లస్ 14 అంతస్తులో ఉంటుంది. 3, 4, 5, 11వ టవర్లను స్టిల్ట్ ప్లస్ పది అంతస్తులో కడతారు. విస్తీర్ణం, ఫ్లాట్ల సంఖ్య అధికం కావడం వల్ల రెండు లగ్జరీ క్లబ్ హౌజ్ లను ఏర్పాటు చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో రెండు పడక గదులకూ ప్రాధాన్యత కల్పించింది. 1225 నుంచి 1290 చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. మూడు పడక గదుల్ని 1425 నుంచి 2250 చదరపు కట్టేందుకు ప్రణాళికలు రచించారు.

లొకేషన్ సూపర్

వాసవి లేక్ సిటీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఫ్లాట్లు కొనుక్కునేవారు హైటెక్ సిటీకి ఎంత సులువుగా చేరుకోవచ్చో.. సెక్రటేరియట్లో పని చేసేవారు అంతే సులభంగా ఆఫీసుకు వెళ్లొచ్చు. ఇక్కడ్నుంచి హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ కి నడుచుకుంటూ వెళ్లొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివ్రుద్ధి చేసిన స్లిప్ రోడ్డు మీదుగా మియాపూర్ మెట్రో స్టేషన్ కి సులువుగానే వెళ్లొచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రభుత్వం డెవలప్ చేస్తున్న ఫ్లయ్ ఓవర్ కూడా పూర్తవుతుంది కాబట్టి.. ఇక్కడ్నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు త్వరగానే వెళ్లొచ్చు. పైగా, హఫీజ్ పేట్ నుంచి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులూ అందుబాటులో ఉన్నాయి.

వాస్తు సూత్రాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్టులో క్లబ్ హౌజ్ నివాసితుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రాజెక్టును మొత్తం పచ్చదనంతో పరఢవిల్లేలా తీర్చిదిద్దుతారు. ఇందులోకి ప్రవేశించేవారిని ఆకట్టుకునే విధంగా ప్రాజెక్టు ఎంట్రెన్స్ ఏరియాను నిర్మిస్తున్నారు. వర్షపు నీటిని సంరక్షించడంతో పాటు నీటిని రీసైకిల్ చేసే సౌకర్యాన్ని కల్పించడం వల్ల భవిష్యత్తులో నీటికొరత ఏర్పడదు.

టోటల్ బ్యాకప్..

ఈ ప్రాజెక్టులో నివసించేవారు విద్యుత్తు కోతల వల్ల విసుగు చెందక్కర్లేదు. ఎందుకంటే అన్ని ఫ్లాట్లకు పవర్ బ్యాకప్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. జనరేటర్ వినియోగాన్ని సూచించే ప్రత్యేక మీటర్ పొందుపరిచారు. క్లబ్ హౌజ్ కు వంద శాతం పవర్ బ్యాకప్ అందజేశారు. భద్రతకు పెద్దపీట వేసే క్రమంలో సీసీటీవీ, ఇంటర్ కామ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. సోలార్ ఫెన్సింగ్ తో పాటు వీడియో డోర్ ఫోన్ సౌకర్యాన్ని అన్ని ఫ్లాట్లకు కల్పించారు. మొత్తానికి, నివాసితులకు అవసరమయ్యే సమస్త సౌకర్యాల్ని కల్పించడం వల్ల వాసవి లేక్ సిటీలో ఫ్లాట్లు కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles