* నగరంలో ‘ఏ’ క్లాసైన ఇల్లంటే ఇదే
* జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో మంత్రి ‘ఏ’
* 6 ఎకరాలు.. 8 బ్లాకులు.. 126 యూనిట్లు
* విస్తీర్ణం: 3195 చ.అ. – 12,385 చ.అ.
* ధర రూ.7.35 కోట్లు- 18.45 కోట్లు
చుట్టూ నీళ్లు.. మధ్యలో అదిరిపోయే డిజైన్ తో కళ్లు చెదిరే అపార్ట్ మెంట్.. ముందు వైపు హైదరాబాద్ లోనే ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్ చెక్ పోస్టు.. వెనుకవైపు మనసుకు ఆహ్లాదం కలిగించే వందల ఎకరాల్లోని కేబీఆర్ పార్కు. అంటే ఒకే చిరునామాలో రెండు అద్భుతమైన వీక్షణలు.. చూస్తే ఔరా అని నోరెళ్లబెట్టక తప్పదు. ఇలాంటి వినూత్న ప్రదేశంలో ఉన్నతమైన సౌకర్యాలతో, విభిన్నమైన ప్రత్యేకత సంతరించుకున్న కమ్యూనిటీలో అత్యున్నతమైన జీవనం గడపాలని భావించేవారికి మంత్రి ‘ఏ’ ప్రాజెక్టును మించింది మరొకటి లేదు అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ప్రముఖ బిల్డర్స్ మంత్రి గ్రూప్ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టు డిజైన్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.
పేరుకు తగ్గట్టే నిజంగా ఇది ‘ఏ’ క్లాస్ ప్రాజెక్టు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జర్మన్ ఆర్కిటెక్ట్ హాది టెహ్రానీ.. దీనిని డిజైన్ చేశారు. భవనం డిజైన్ నుంచి ఇంటీరియర్, ల్యాండ్ స్కేప్, ఆర్ట్ వర్క్ ఇలా ఏది చూసినా దేనికదే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నీటి మధ్యలో ఈ ప్రాజెక్టు ఉండేలా డిజైన్ చేయడం దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. మొత్తం 8 బ్లాకుల్లో 126 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. రెరా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో 3195 చదరపు అడుగుల నుంచి 12,385 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 4, 5 బీహెచ్ కే ఫ్లాట్లను నిర్మిస్తున్నారు.
* ఈ లొకేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్ లో.. అది కూడా చెక్ పోస్టు పక్కనే, కేబీఆర్ పార్కు ముందు ప్రపంచ శ్రేణి సౌకర్యాలతో అదిరిపోయే విధంగా 6 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఫ్లాట్ ధర చదరపు అడుగుకి రూ.15వేలు. అంటే ఒక ఫ్లాట్ కనీస ధర దాదాపు రూ.7.35 కోట్లు కాగా, గరిష్టంగా రూ.18.45 కోట్లు అన్నమాట. ‘ఏ’ క్లాసైన ఇల్లు కావాలంటే ఆ మాత్రం వెచ్చించక తప్పదు మరి.
మంత్రి ఏ ప్రత్యేకతలు ఇవీ..
– నీటి కొలను మధ్యలో అపార్ట్ మెంటు ఉండటం
– వ్యక్తిగత గోప్యత కోసం ఒక్కో కోర్ లో రెండే అపార్ట్ మెంటులు
– రూఫ్ గార్డెన్ తో ప్రత్యేకంగా టాప్ ఫ్లోర్
– విలాసవంతమైన క్లబ్ హౌస్
– నీటికొలను కింద నుంచి అపార్ట్ మెంట్ లోకి ప్రవేశం.
– ప్రతి బ్లాకుకు రెండు లిఫ్టులు. ప్రతి ఫ్లాట్ కు ఎలివేటర్ ద్వారా నేరుగా వెళ్లొచ్చు
– అన్ని ఫ్లాట్లూ కేబీఆర్ పార్కు వైపు ఫేసింగ్
– మూడు లెవెల్స్ లో పార్కింగ్
– మొత్తం అన్ని గదుల్లో టెలిఫోన్ పాయింట్లు
– వంద శాతం పవర్ బ్యాకప్ సౌకర్యం
– బయోమెట్రిక్ సెక్యూరిటీ సిస్టమ్
– వంద శాతం వాస్తు
– బిజినెస్ సెంటర్
– మినీ థియేటర్
– ఫిట్ నెస్ సెంటర్
– స్క్వాష్ కోర్టు
– బ్యూటీ పార్లర్
– హెయిర్ సెలూన్
– బాస్కెట్ బాల్ కోర్టు
– స్టీమ్, సానా, మసాజ్ రూం