హైదరాబాద్లో మోసపూరిత రియల్టర్లు రోజురోజుకి బరితెగిస్తున్నారు. అనుమతుల్లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించడమే కాదు ఏకంగా హెచ్ఎండీఏ లోగో వేసి మరీ సామాన్యులకు అంటగడుతున్నారు. మరి, ఇలాంటి మోసపూరిత ప్రమోటర్ల మీద హెచ్ఎండీఏ ఎలాంటి చర్యల్ని తీసుకుంటుంది? కొద్ది రోజుల్నుంచి అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్న హెచ్ఎండీఏ.. ఇలాంటి అక్రమ వెంచర్లు, నిర్మాణాల్ని ఆదిలోనే ఎందుకు తుంచివేయదు? ప్రజలు కొనుగోలు చేశాక, అపార్టుమెంట్ల నిర్మాణం మధ్యలో ఉన్నాక వాటిని కూల్చివేస్తే జాతీయ సంపద వృథా అయినట్లే కదా! కాబట్టి, ఇలాంటి మోసపూరిత ప్రమోటర్ల ప్రాజెక్టులపై ఆరంభంలోనే తుది చర్యలు తీసుకోవాలి.