poulomi avante poulomi avante

ఆహ్లాదానికి అడ్రస్ “ది ఆర్ట్” @ బండ్ల‌గూడ, టీఎస్‌పీఏ జంక్ష‌న్‌

  • ఓసీ వ‌చ్చేసింది.. రెడీ టు మూవ్‌
  • స‌రికొత్త థీమ్ క‌ళ్ల ముందే ప్ర‌త్య‌క్షం
  • సైంటిఫిక్ కాన్సెప్టుతో ఆధునిక వాట‌ర్ ఫాల్
  • నెగ‌టివ్ ఆలోచ‌న‌లు మ‌టుమాయం..
  • ఫుల్ పాజిటివ్ ఎన‌ర్జీ, స‌రికొత్త ఆలోచ‌న‌లు
  • ప్ర‌తిరోజూ పండ‌గే అంటున్న ద ఆర్ట్ వాసులు
  • ఒక్క‌సారి వ‌స్తే చాలు.. ఇక్క‌డే ఉండిపోతారు!

హైద‌రాబాద్‌లో చాలామంది కాంక్రీటుతో అపార్టుమెంట్ల‌ను నిర్మిస్తారు. ట‌వ‌ర్ల‌ను నిర్మించి మ‌ధ్యమ‌ధ్య‌లో గ్రీన‌రీని జొప్పిస్తారు. కానీ, గిరిధారి హోమ్స్ ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో.. కొనుగోలుదారుల‌కేం కావాల‌నే ఆలోచించి.. ఎలాంటి థీమ్ ఉంటే ప్ర‌జ‌లు ఆస్వాదిస్తార‌నే అంశాన్ని లోతుగా ప‌రిశోధించి.. నిపుణులతో సుదీర్ఘంగా చ‌ర్చించి.. ఆధునిక ప్రాజెక్టుల‌ను తీర్చిదిద్దుతుంది. గిరిధారి హోమ్స్ పూర్తి చేసిన ద ఆర్ట్ ప్రాజెక్టును స్వ‌యంగా గ‌మ‌నిస్తే.. ఇందులో సొంతిల్లు కొన‌కుండా ఉండ‌లేరు.

క‌రోనా త‌ర్వాత ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, అభిరుచిలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వీరికి కావాల్సింది ఫ్లాట్లు మాత్రమే కాదు.. నిత్య సంతోషాన్ని క‌లిగించే ప్రాజ‌క్టు కావాలి. అలాంటి ప్రాజెక్టే.. గిరిధారి ద ఆర్ట్‌. హైద‌రాబాద్‌లోనే ఎక్క‌డా లేన‌టువంటి సైంటిఫిక్ కాన్సెప్టును ఇందులో ప్ర‌వేశ‌పెట్టింది సంస్థ‌. క్ల‌బ్ హౌజులో నెగటివ్ అయాన్ జోనుతో ఒక వాటర్ ఫాల్ థీమును ప్ర‌వేశ‌పెట్టింది. ముప్ప‌య్ అడుగుల ఎత్తు నుంచి వాట‌ర్ ఫాల్ కింద ప‌డుతుంటే.. దాన్ని ముందే కూర్చున్న‌వారి మోముకి ఆ నీటి తుంప‌ర్లు తాకుతుంటే ఎక్క‌డ్లేని పాజిటివ్ ఎన‌ర్జీ ల‌భిస్తుంది.

ఈ ఆనందాన్ని ప్ర‌తిఒక్క‌రూ ఆస్వాదించాల‌ని గిరిధారి హోమ్స్ ఆ మొత్తం ప్రాంతాన్ని క‌ళాత్మ‌కంగా తీర్చిదిద్దింది. ఇక్క‌డ కూర్చుంటే చాలు.. ప్ర‌తిఒక్క‌రికీ మానసిక ప్రశాంతత ల‌భిస్తుంది. శారీరక ఆరోగ్యం మెరుగ‌వుతుంది. ఆహ్లాదం, వినోదం దొర‌కుతుంది. పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఇలా ప్ర‌తిరోజు పండ‌గే క‌లిగే విధంగా ప్రాజెక్టును మ‌లిచిన తీరు అద్భుత‌మ‌ని కొనుగోలుదారులే స్వ‌యంగా కొనియాడుతున్నారు.

గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ మొదటి ఎగ్జిట్ టీఎస్‌పీఏ జంక్షన్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో, అత్యధిక గ్రీనరీ వేలాది ఎకరాలు ఉన్న కాలుష్యం లేని బండ్లగూడలో 3. 8 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకున్న‌ది. కేవలం 5 అంతస్తుల ఎత్తులో.. ఇర‌వై వేల మొక్కలతో 270 ఫ్లాట్లు గ‌ల ఫుల్ గ్రీనరీ ఉన్న క‌ళాత్మ‌క‌మైన నిర్మాణ‌మిది. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి రెరా ప్రాజెక్టు అయిన గిరిధారి హెమ్స్ రాజక్షేత్రను కొనుగోలుదారులకు అందించిన విధంగానే.. ఈ ఉగాదికి ద ఆర్ట్ ప్రాజెక్టును ఆర్ట్ అసోసియేషన్ కు అందించే ఉత్సవాల్ని ప్రతి శనివారం సాయంత్రం గిరిధారి హోమ్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది.

త్రీడీ కాదు.. వాస్తవమిదీ..

తమ ప్రాజెక్టు ఇంత గొప్పది, అంత గొప్పది అని త్రీడీ వీడియోల్లో ప్రతిఒక్కరూ చెప్పుకుంటారు. అది వారి మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. కాకపోతే ఎంతమంది బిల్డర్లు అనుకున్న సమయానికి డెలివరీ చేస్తారనేది కీలకం. ఈ అంశమే కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తుంది. కొవిడ్ మూడు వేవ్లను ఎదుర్కొని, సమయానికి ప్రాజెక్టును అందించడమంటే ఆషామాషీ విషయమేం కాదు. ముఖ్యంగా వేసవిలో పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు ప్రకృతియే ఒక ఆర్ట్ అని.. పంచభూతాల్ని మనం ఆస్వాదించినప్పుడే మానసిక‌ ఆహ్లాదం కలుగుతుందని మనసా, వాచా నమ్మి.. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో కూడా లేని ఒక వాటర్ ఫాల్ ను అందించిన ఘనత గిరిధారి హోమ్స్ కే దక్కుతుంది.

ఇందులో నివ‌సించేవారు సినిమాల కోసం బయటికి వెళ్ల‌క్క‌ర్లేని విధంగా ఆధునిక డిజిట‌ల్ థియేట‌ర్‌ను పొందుప‌ర్చింది. ఇంటికొచ్చిన అతిథులు, బంధుమిత్రుల‌తో క‌లిసి ఎంచ‌క్కా న‌చ్చిన సినిమాను చూడొచ్చు. ఎవ‌రికి నచ్చినంత సేపు వారు డ్యాన్స్ చేసుకునేందుకు ఒక థియేటర్ ఏర్పాటు చేసింది. పెద్దలు, పిల్లలు, మహిళలకు ప్రత్యేక స్విమ్మంగ్ పూల్, విశాలమైన జిమ్, లైబ్రరీ, డిజిటల్ ల్యాబ్స్ రూమ్, అందమైన పార్టీ లాన్లు, మెడిటేషన్ జోన్, ఔట్ డోర్ బ్యాడ్మింటన్ కోర్టు, ప్లే స్కూల్, సూపర్ మార్కెట్ వంటి అనేక ఆధునిక సదుపాయాల్ని అంద‌జేసింది.
గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ వంటి ప్రాంతాల్నుంచి.. బండ్ల‌గూడ‌లో ముస్తాబైన‌ ద ఆర్ట్ ప్రాజెక్టుకు కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక్కడి ప్రాంతాల్లో లభించే ధర కంటే అతి తక్కువకే సొంతింటిని సొంతం చేసుకోవచ్చు. మనసుకు ఆహ్లదాన్ని పంచే వినోదాన్ని అందించే, పిల్లల సృజనాత్మకను పెంచే ద ఆర్ట్ ప్రాజెక్టు గురించి సంపూర్ణంగా తెలుసుకునేందుకు ఈ వారమే విజిట్ చేసేందుకు అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక్కడ రెండు గంటలుంటే చాలు.. జీవితాంతం నివ‌సించాల‌నే ఆలోచ‌న త‌ప్ప‌కుండా క‌లుగుతుంది.

ఓసీ ఆగ‌యా.. రెడీ టు మూవ్‌!

కొవిడ్‌ తరువాత సొంతిల్లు ఉండాలనే ఆలోచన అధిక‌మైంది. ముఖ్యంగా, ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌గా ఉండాల‌నే భావ‌న ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చింది. ఫ‌లితంగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి.
విల్లా రేట్ల‌యితే రాజ‌కోట‌ల‌ను దాటేసింది. గ‌చ్చిబౌలి, కోకాపేట్‌లో ఫ్లాట్ల రేట్లు విల్లా స్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో “వివేకమంతమైన” నిర్ణయం ఏదైనా ఉంటే అది “రెడీ టూ మూవ్” ఇల్లు కొనుక్కోవ‌డ‌మే. అదీ ఓసీ (ఆక్యుపేష‌న్ స‌ర్టిఫికెట్‌) వచ్చి ఉన్న ప్రాజెక్టులో ఇల్లు అయితే.. క‌ళ్ల ముందే క‌నిపిస్తుంది. కారు టెస్ట్ డ్రైవ్ చేసి చూసినట్లు, ఆ ప్రాజెక్టులో ఉదయం – సాయంత్రం సమయం గడిపి, మదికి , మనస్సుకు సబబు అనిపిస్తే అర్జెంటుగా ఆ ఇల్లు కొంటే.. ప్రశాంతమైన ఆనందంతో కూడిన జీవితానికి ఆ ఇల్లు హరివిల్లవుతుంది. అలాంటి ఒక ఆప్షన్ ఏదైనా ఉంటే అది గిరిధారి హోమ్స్ “ది ఆర్ట్ ” అని చెప్పొచ్చు. ఇల్లు కొనాల‌నుకునే ప్ర‌తిఒక్క‌రూ ఈ ప్రాజెక్టును చూడాల్సిందే.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles