- సిల్వర్ ఓక్స్ స్కూల్ చేరువలో..
- హైదరాబాద్‌లోనే ప్రప్రథమ కిడ్స్ ఫ్రెండ్లీ హోమ్స్ ప్రాజెక్టు
- కొవిడ్ నేపథ్యంలో చిన్నారులకు ప్రాధాన్యత
- రెండు ఎకరాల్లో 160 ఫ్లాట్లు
- ఆరంభ ధర చదరపు అడుక్కీ రూ.5,500
- జర్నలిస్టులకు ప్రత్యేక డిస్కౌంటు
బాచుపల్లిలో ప్రప్రథమంగా చిల్డ్రన్ ఫ్రెండ్లీ హోమ్స్‌కు ఆర్క్ హోమ్స్ శ్రీకారం చుట్టింది. దీనికి ఆర్క్ సమ్యక్ అని నామకరణం చేసింది. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో 160 ఫ్లాట్లను నిర్మిస్తారు. పది అంతస్తుల ఎత్తులో రెండు టవర్లను కడతారు. ఫ్లాట్ల విస్తీర్ణం 1315 నుంచి 1760 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ ప్రాజెక్టు కావడం గమనార్హం. ధర విషయానికి వస్తే.. చదరపు అడుక్కీ రూ. 5,500 చెబుతున్నారు. ఈ రెండు ఎకరాల నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేసేందుకు సంస్థ ప్రణాళికల్ని రచిస్తోంది.
కొవిడ్ సమయంలో చిన్నారులు ఇంటికే పరిమితం కావడంతో బయటికి వెళ్లలేకపోయారు. ఈ సమస్యను గమనించాకే.. కిడ్స్ ఫ్రెండ్లీ ఇళ్లను నిర్మించాలనే ఆలోచన వచ్చినట్లు ఆర్క్ హోమ్స్ సీఈవో గుమ్మి మేఘన అన్నారు. ఒకవేళ కరోనా వంటి పరిస్థితులు తలెత్తినా..
చిన్నారులు తమకు ఇష్టమైన రీతిలో ఆడుకునే విధంగా ఇంటాబయటా తీర్చిదిద్దామని వివరించారు. క్లబ్ హౌజ్ విషయానికి వస్తే.. కేవలం చిన్నారులకే విడిగా ప్లే సెంటర్ క్రియేట్ చేశారు. ఆకర్షణీయంగా ల్యాండ్ స్కేప్ ని తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్టును డిజైన్ చేసేటప్పుడే ప్రతి చిన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.