- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ హబ్ లో
- హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు
అటు పర్యావరణం.. ఇటు సౌందర్యం.. రెండింటినీ కలబోసి వెలికి తీసిన అద్భుత కళాఖండమే జయభేరి ద నిర్వాణ ప్రాజెక్టు. పట్టణ జీవనశైలికి పునర్ నిర్వచనంగా నిలిచిన ఈ ప్రాజెక్టులో అత్యత్భుతమైన సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని సామరస్యపూర్వక వాతావరణంలో గడపాలనుకునేవారికి ద నిర్వాణను మించి ఛాయిస్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ, రెసిడెన్షియల్ హబ్ గచ్చిబౌలిలో క్యూ సిటీ రోడ్డు వెంబడి విప్రో జంక్షన్ కు కేవలం 1.6 కిలోమీటర్ల దూరంలో జయభేరి 4 సీజన్స్ లే ఔట్ పక్కనే ద నిర్వాణ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఎడెకరాల గేటెడ్ లేఔట్ లో 79 శాతం ఓపెన్ ప్రాంతంతో 29 అంతస్తులతో ఐదు టవర్లు అదిరిపోయే రీతిలో నిర్మితమవుతున్నాయి. 1885 చదరపు అడుగుల నుంచి 2225 చదరపు అడుగుల మధ్యలో 693 హై ఎండ్ 3 బీహచ్ కే అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో 49 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న విలాసవంతమైన క్లబ్ హౌస్.. ఈ ప్రాజెక్టుకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.
లైటింగ్ తో కూడిన విస్తృతమైన డిజైనర్ ల్యాండ్ స్కేపింగ్ మీ మనసు దోచుకోవడం ఖాయం. ప్రతి టవర్ కు ఓ ఎంట్రన్స్ లాబీతోపాటు పైప్డు గ్యాస్ సరఫరా వ్యవస్థ, ఎలక్ట్రిక్ కార్ చార్జింగ్ స్టేషన్లు, 100 శాతం పవర్ బ్యాకప్ వంటి బోలెడు సౌకర్యాలు ఉన్నాయి. నీటి సౌకర్యంతో కూడిన ప్రధాన ప్రవేశ ద్వారం, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ పూల్, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, నెట్ తో కూడిన క్రికెట్ పిచ్, పిల్లల ఆటస్థలం, ఏంఫిథియేటర్, పార్టీ లాన్, ఎలివేటెడ్ స్కై వాక్, జాగింగ్ ట్రాక్, వాక్ వేలు వంటి పలు ఫీచర్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.