poulomi avante poulomi avante

అప్పా జంక్షన్లో రెరా ప్రాజెక్టులివే

  • ఏరియాలు: కిస్మత్ పూర్, బండ్లగూడ, పిరంచెరువు
  • రెరా ప్రకారం.. ఇక్కడ నిర్మాణంలో ఉన్నవి 2,963 ఫ్లాట్లు
  • వీటిని 2026లోపు బయ్యర్లకు అందజేస్తారు

అటు కోర్ హైద‌రాబాద్ అటు ప‌శ్చిమ హైద‌రాబాద్‌కు చేరువ‌లో ఉన్న ప్రాంతాల్లో అప్పా జంక్ష‌న్ (టీఎస్‌పీఏ) ప్రాంతం ప్ర‌ముఖంగా నిలుస్తుంది. ఇక్క‌డ్నుంచి అసెంబ్లీ లేదా సెక్ర‌టేరియ‌ట్ వెళ్లాలంటే కేవ‌లం 13 కిలోమీట‌ర్ల దూర‌మే ఉంటుంది. ఇంచుమించు అదే దూరంలో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ కూడా ఉంటుంది. అందుకే, గ‌త కొంత‌కాలం నుంచి అనేక మంది సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకంతో పాటు ఐటీ నిపుణులు అప్పా జంక్ష‌న్ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. కాలుష్యం లేని ప్రాంతం కావ‌డం, పాఠ‌శాల‌లు, కాలేజీలు, ఆస్ప‌త్రులు వంటివ‌న్నీ చేరువ‌గా ఉండ‌టం వంటివి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. కిస్మ‌త్‌పూర్‌, బండ్ల‌గూడ‌, పిరంచెరువు వంటివి ముఖ్య‌మైన ప్రాంతాలుగా పేర్కొన‌వ‌చ్చు. ఇందులో ప్ర‌స్తుతం ఎక్క‌డెక్క‌డ రెరా అనుమ‌తి గ‌ల ప్రాజెక్టులున్నాయో ఒక‌సారి లుక్కేద్దాం.

కిస్మ‌త్‌పూర్ రెరా ప్రాజెక్టులివే..

  •  శాంతాశ్రీరాం క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ బ్రూక్ వుడ్స్ అనే విల్లా ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇందులో 49 విల్లాల్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది కొనుగోలుదారుల‌కు అప్ప‌గిస్తారు.
  •  గిరిధారి హోమ్స్ ప్రాస్ప‌రా కౌంటీ విల్లా క‌మ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది. ఇందులో మొత్తం 98 విల్లాలు వ‌స్తాయి. ధ‌ర రూ.6.65 కోట్ల నుంచి ఆరంభం.
  •  కిస్మత్ పూర్లో ప్రస్తుతం 35 ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి.
  •  గృహ‌శిల్పా స‌ప్త‌ప‌ది సంస్థ 25 ఫ్లాట్ల‌ను క‌డుతోంది. ఇందులో ధ‌ర రూ.93.42 ల‌క్ష‌ల్నుంచి ఆరంభం.
  •  ఉన్న‌తి ప్రైడ్ అనే ప్రాజెక్టులో ప‌ది ఫ్లాట్లను క‌డుతున్నారు. 2024లో ప్రాజెక్టును పూర్తి చేస్తారు. ధ‌ర గురించి సంస్థ‌ను అడిగితే తెలుస్తుంది.

బండ్లగూడలో పలు రెరా నిర్మాణాలు..

రెరా ప్రకారం.. ఎస్ఎంఆర్ వినయ్ కాసా కరినో ఒక్కటే బండ్లగూడలో విల్లా ప్రాజెక్టు. ఇందులో మొత్తం 143 విల్లాల్ని నిర్మిస్తున్నారు. ఇది 2023 డిసెంబరులోపు పూర్తి అవుతుంది.

  • ఇక్కడ మొత్తం ఎనిమిది రెరా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
  •  గిరిధారి హోమ్స్ ఆర్ట్, హనీష్ ప్రైడ్, జీకేఆర్ఎస్ బ్లిస్ 1, ఎస్ఎంఆర్ వినయ్ బోల్డర్ వుడ్స్, శ్రీవారి గోకులం,  దుందుబి ప్రథమ హైట్స్, ఆర్వీ అక్షోభ్య వంటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
    ఇందులోవన్నీ కలిపితే వచ్చేవి సుమారు 1,106 ఫ్లాట్లు. రెరా ప్రకారం ఇవన్నీ 2025 మే వరకూ పూర్తవుతాయి. ఈ ఏడాది చివరిలోపు కొనుగోలుదారులకు అందించేది 330 ఫ్లాట్లే. మిగతావి వచ్చే రెండున్నరేళ్లలోపు పూర్తి చేస్తామని ఆయా సంస్థలన్నీ రెరాకు చెప్పినప్పటికీ, అంతకంటే ముందే పూర్తవుతాయని భావించొచ్చు.

పిరంచెరువులో రెరా ప్రాజెక్టులు..

పిరంచెరువులో మొత్తం ఆరు అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. పీబీఈఎల్ సిటీ మూడు టవర్లను కడుతోంది. కేటీ రెసిడెన్సీ, బోధి వ్రెక్ష, హేమదుర్గా ఎగ్జాటికా వంటివి రెరా అనుమతి తీసుకున్నాయి. ఇక్కడ మొత్తం 1,822 ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి.

  • పీబీఈఎల్ సిటీ ఎం సఫైర్ (197 ఫ్లాట్లు), ఎన్ రూబీ (198 ఫ్లాట్లు), ఆక్వామెరీన్ (208 ఫ్లాట్లు) వంటి బ్లాకులను నిర్మిస్తోంది. ఈ ఒక్క సంస్థే ప్రస్తుతం 603 ఫ్లాట్లను కడుతోంది. 2023 మార్చి 1 లోపు వీటిని బయ్యర్లకు అందజేస్తుంది.
  •  కపిల్ సంస్థ కేటీ రెసిడెన్సీ ప్రాజెక్టు 2024లో పూర్తవుతుంది. బోధి వక్రుక్ష 2026, హేమదుర్గ ఎగ్జాటికా 2026 పూర్తవుతుంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles