హైదరాబాద్‌లో నాణ్యమైన నిర్మాణాల్ని రాజపుష్ప ప్రాపర్టీస్ చేపడుతుంది. ఈ సంస్థ ప్రాజెక్టు డిజైనింగ్‌లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. ప్రతి ప్రాజెక్టులో.. ఫ్లాట్ సైజులు, ఎలివేషన్, కారిడార్ స్పేస్, ఎంట్రెన్స్ లాబీ, నిర్మాణ సామగ్రి ఎంపిక.. ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకతను చాటి చెబుతోంది. రాజపుష్ప ఇప్పటి వరకూ పూర్తి చేసిన నిర్మాణాల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలైనా.. విల్లా ప్రాజెక్టులైనా.. వాణిజ్య సముదాయాలైనా.. సకాలంలో అందజేస్తుందనే ఖ్యాతినార్జించింది.
రాజపుష్ప ప్రాపర్టీస్ తాజాగా నార్సింగిలో రాజపుష్ప ప్రొవిన్షియా అనే హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. ప్రీమియం లైఫ్ స్టయిల్ కోరుకునేవారికి ఈ నిర్మాణం చక్కగా నప్పుతుంది. 23.75 ఎకరాల విశాలమైన స్థలంలో.. 11 టవర్లను నిర్మిస్తోంది. ఒక్కో టవర్ జి ప్లస్ 39 అంతస్తుల్లో కడుతోంది. 2, 3 పడక గదులకు పెద్దపీట వేసింది. రెండు పడక గదుల ఫ్లాట్లు అయితే 1370 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తుండగా.. మూడు పడక గదుల ఫ్లాట్లను 1715, 2020, 2335, 2660 చదరపు అడుగుల్లో కడుతోంది. హైదరాబాద్‌లోనే ప్రత్యేకంగా రెండు క్లబ్ హౌజుల్ని ఈ ప్రాజెక్టులో నిర్మిస్తోంది. దాదాపు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌజుల్ని చేపడుతోంది. ప్రాజెక్టు మొత్తం 80 శాతం ఖాళీ స్థలమే. నిర్మాణం వచ్చేది కేవలం 20 శాతం స్థలంలోనే. ధర విషయానికి వస్తే.. 2పడక గదుల ఫ్లాటు రూ.90.74 లక్షల నుంచి ఆరంభమవుతుంది. ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లు రూ.1.13 కోట్లుగా చెబుతున్నారు. 2025 మార్చిలో మొదటి విడత ఫ్లాట్లను అందించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరిగే అవకాశాన్ని ముందే గుర్తించిన రాజపుష్ప ప్రాపర్టీస్.. కారు పార్కింగుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ల సౌకరాన్ని ప్రత్యేకంగా కల్పిస్తోంది. పైగా, ఇండోర్ ఏసీ బాస్కెట్ బాల్ కోర్టును అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
రాజపుష్ప ఇంపీరియా
హైదరాబాద్‌లో ఉన్నతమైన జీవనశైలిని ఆనందించాలని కోరుకునేవారి కోసం రాజపుష్ప ప్రాపర్టీస్ ఆవిష్కరించిన సరికొత్త ప్రాజెక్టే.. రాజపుష్ప ఇంపీరియా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్ చేరువలో ఆరంభించిన ఈ ప్రాజెక్టు ప్రీమియం లైఫ్‌స్టయిల్ కోరుకునేవారికి చక్కగా నప్పుతుంది. సుమారు 24 ఎకరాల్లో 8 టవర్లను నిర్మిస్తారు. అన్నీ నలభై అంతస్తుల అపార్టుమెంట్లే కావడం గమనార్హం. 1350 – 2880 చదరపు అడుగుల సైజుల్లో ఫ్లాట్లు ఉంటాయి. ధర విషయానికి వస్తే.. సుమారు.. ₹83.68 లక్షల నుంచి ఆరంభమవుతుంది.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. సుమారు 82 శాతం ఓపెన్ స్థలం వస్తుంది. అంటే, నిర్మాణం వచ్చేది 18 శాతం స్థలంలోనే అన్నమాట. ఇందులోని సెంట్రల్ కోర్టు యార్డ్ చూస్తే ఎక్కడ్లేని సంతోషం కలుగుతుంది. క్లబ్ హౌజ్‌లో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసింది సంస్థ. రెండు పడక గదుల ఫ్లాట్లు 1350, 1375 చదరపు అడుగుల్లో.. ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లు 1550 to 2880 చదరపు అడుగుల్లో లభిస్తాయి. 2026 మార్చిలో ఈ ప్రాజెక్టును కొనుగోలుదారులకు అందజేస్తారు.
ఓసీ అందుకున్న
రాజపుష్ప ఎటర్నా
రాజపుష్ప నుంచి జాలువారిన మాస్టర్ పీస్ లాంటి ప్రాజెక్టే.. రాజపుష్ప ఎటర్నా. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలో నిర్మిస్తున్నారు. కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నిమిషాల్లో ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. దాదాపు 4.6 ఎకరాల స్థలంలో జి ప్లస్ 14 అంతస్తుల ఈ ప్రాజెక్టులో వచ్చే ఫ్లాట్లు.. 290. నిర్మాణం వచ్చేది కేవలం 30 శాతం స్థలంలోనే. మిగతదాంట్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. ఇది లో డెన్సిటీ అపార్టుమెంట్ కమ్యూనిటీ అని సంస్థ చెబుతోంది. నివాసితుల కోసం 31,500 చదరపు అడుగుల్లో క్లబ్ హౌజ్ అందజేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. ఇందులో కొన్న వెంటనే.. ఇంటీరియర్స్ చేసుకుని.. గృహప్రవేశం చేయవచ్చు. మూడు పడక గదుల ఫ్లాట్లు 2360, 2680 చదరపు అడుగుల్లో.. నాలుగు పడక గదుల ఫ్లాట్లు.. 4300, 4340 చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజైన్ చేశారు. ధర విషయానికొస్తే.. మూడు పడక గదుల ఫ్లాట్ రేటు రూ.1.93 కోట్ల నుంచి లభిస్తుంది. నాలుగు పడక గదుల ఫ్లాట్.. సుమారు రూ.3.65 కోట్ల నుంచి ఆరంమవుతుంది.
ఐటీ బిల్డింగ్.. రాజపుష్పా పారడిమ్
రాజపుష్ప ప్రాపర్టీస్ కేవలం నివాస కట్టడాలే కాదు.. వాణిజ్య సముదాయాల్లో తన ప్రత్యేకతను చాటి చెబుతోంది. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలో సుమారు 2.63 ఎకరాల విస్తీర్ణంలో.. 1.05 మిలియన్ చదరపు అడుగుల ఐటీ భవనాన్ని నిర్మించింది. దీనికి రాజపుష్ప పారడిమ్ అని పేరు పెట్టింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ఐటీ బిల్డింగ్‌కి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కూడా లభించింది. దాదాపు జి ప్లస్ 18 అంతస్తుల ఎత్తులో నిర్మించిన ఈ ప్రాజెక్టులో స్థలం తీసుకుంటే చాలు.. కంపెనీలను ఏర్పాటు చేసుకోవచ్చు.