poulomi avante poulomi avante

నాకూ ఓ ఫాంహౌస్ కావాలి

  • రియల్ ఎస్టేట్ గురుతో నటి జరీన్ ఖాన్

సెలబ్రిటీ హోమ్స్ సిరీస్ లో భాగంగా ప్రతి వారం ఓ సెలబ్రిటీతో ముచ్చటిస్తూ.. ఆ విశేషాలను పాఠకులతో పంచుకుంటున్న ‘రియల్ ఎస్టేట్ గురు’.. ఈసారి నటి జరీన్ ఖాన్ ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె కలల సౌథం ఎలా ఉండాలనే అంశంపై ఆమె ఆకాంక్షలను తెలుసుకుంది. పఠానీల సంస్కృతిని ప్రతిబింబించేలా తనన కలల సౌథం ఉండాలని జరీన్ ఖాన్ వెల్లడించారు. అఫ్గానిస్తాన్ కు చెందిన ఈ నటి.. తన చిన్ననాటి ఇంటితో మొదలుపెట్టి చాలా సంగతులు పంచుకున్నారు.

‘మాకు శాంతా క్రజ్ లో ఓ చిన్న ఇల్లు ఉంది. మా నాన్న బంధువులు మా చుట్టుపక్కల ఉండేవారు. అది వన్ బీహెచ్ కే అయినప్పటికీ, నా చిన్నతనంలో ఎంతగానో ఆనందించిన క్షణాలు ఆ ఇంటితోనే ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ పరిశ్రమలో నేను ఎదుగుతున్నాను. అయినప్పటికీ నా ఇంటిని అలంకరించుకునే విషయంలో మాత్రం వీలైనంత వరకు సాదాసీదాగానే వెళ్తాను. ఇందులో ఎలాంటి నాటకీయతా లేదు. నా వృత్తి వీలైనన్ని విలాసవంతమైన హోటళ్లలో గడిపే వెసులుబాటు కల్పిస్తుంది. కానీ నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. అది నాకు హాయి గొలిపే అనుభూతి ఇస్తే చాలు.

మినిమలిజం అనేది ఈ రోజుల్లో విస్తృతమైన జీవనశైలిగా మారింది. నేను ఇంటికి వచ్చేసరికి ఫర్నిచర్ ప్రదర్శన అవసరం లేదు. నా సంస్కృతి యొక్క సహజ అభిరుచిని దాచిపెడితే, నా ఇంటీరియర్ డిజైన్ భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు కూడా నా గదిలో కనీసం డ్రెస్సింగ్ టేబుల్ కూడా మీరు కనుక్కోలేరు. నేను అంత సింపుల్ గా ఉంటాను. అయితే, మా అమ్మ మాత్రం మా ఇల్లు విలాసవంతమైన ప్యాలెస్ లా కనిపించాలని, అదిరిపోయే రంగులు ఉండాలని కోరుకుంటుంది. డెకరేషన్ విషయంలో మా ఇంట్లో కాస్త ఒత్తిడి ఉంది. ఈ విషయంలో మాకు ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది’ అని జరీన్ వివరించారు.

ఆతిథ్యం కూడా జరీన్ కు చాలా ముఖ్యమైన అంశం. ‘నేను జంతు ప్రేమికురాలని. వీలైనన్ని జంతువులను పెంచడం కోసం విల్లానే ఎంచుకుంటాను. నా పెంపుడు జంతువులకు గార్డెన్ ఉండాలన్నది నా కోరిక. అలాగే సల్మాన్ ఖాన్ ను చూసిన తర్వాత నాకు ఓ ఫాంహౌస్ ఉండాలనే కోరిక కలిగింది. నేను ప్రకృతిలో జీవించడాన్ని ఇష్టపడతాను. పండ్లు, కూరగాయలను పండించగలను. నేను టార్జాన్ నుంచి జేన్ గా మారి కొంతసేపు అలా ఉండాలనుకుంటున్నా’ అని జరీన్ పేర్కొన్నారు. ఇక షూటింగ్ లేని సమయంలో జరీన్ తన పెంపుడు జంతువుల కోసం ఏర్పాటు చేసిన రహస్య గదిలోనే ఎక్కువసేపు ఉంటారు. ‘ఇది పిచ్చిగా అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ నా పెంపుడు జంతువుల కోసం నేను ప్రత్యేకంగా ఓ గదిని కలిగి ఉన్నాను. మా ఇంట్లో మనుషుల కంటే జంతువులే ఎక్కువ. అవి నా ఒత్తిడిని తగ్గిస్తాయి. వాటి కోసం ఓ ప్రత్యేకమైన గది ఉండటం భద్రతాపరమైన భావనను సృష్టించడానికి సహాయపడుతుంది’ అని జరీన్ పేర్కొన్నారు.

టాలీవుడ్ నుంచి సినీ జీవితాన్ని ప్రారంభించిన జరీన్ ఖాన్.. ప్రయాణాలంటే ఇష్టమని వెల్లడించారు. ‘తరచుగా ప్రయాణాలు చేయడం ఇష్టం కాబట్టి, ప్రతి దేశంలోనూ నివసించాలని కోరుకుంటాను. ప్రతి దేశాన్ని అన్వేషించాలనుకుంటాను. గోవా, మనాలీలో నా కలల సౌథం నిర్మించాలని నేను భావించే ప్రదేశాలు. అలాగే లండన్ కూడా ఈ జాబితాతో ఉండొచ్చు. ఏమైనప్పటికీ దుబాయ్ నా ఇల్లువంటిది. ఇక నా కలల సౌథం ఫ్లీ మార్కెట్ లా ఉండకూడదు’ అని స్పష్టంచేశారు. వీర్ నుంచి సల్మాన్ తో జరీన్ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఇంటిని జరీనా అమితంగా ఇష్టపడతారు. ‘సల్మాన్ ఖాన్ మనకు ఉన్న అతిపెద్ద సూపర్ స్టార్. కానీ ఆయన అపార్ట్ మెంట్ లో ఉన్నారు. నేను కూడా అంతే. ఆయన ఇంట్లో విపరీతమైన ఫర్నిచర్ లేదా అంతర్జాతీయ వస్తువులు కనిపించవు. అలాగే నేను అక్షయ్ ఇంటిని కూడా చూశాను. అది బీచ్ వ్యూ విల్లా. చూడగానే తన్మయత్వంలో మునిగిపోయాను’ అని జరీన్ కాన్ చెప్పి ముగించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles