హైదరాబాద్‌లో నిన్నటివరకూ.. ఐదు అంతస్తుల ఫ్లాట్లు అయినా బహుళ అంతస్తుల భవనాలైనా.. అధిక శాతం మంది బిల్డర్లు.. రెడ్ బ్రిక్స్, సిమెంట్ ఇటుకలను వినియోగించేవారు. కానీ, నేడు పలువురు బిల్డర్లు ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. నిర్మాణాల్ని వేగంగా చేపట్టేందుకు షీయర్ వాల్ టెక్నాలజీ వైపు అడుగులేస్తున్నారు. ఫలితంగా, ఎక్కువగా భవన నిర్మాణ కార్మికుల మీద ఆధారపడకుండా అతివేగంగా అపార్టుమెంట్లను పూర్తి చేస్తున్నారు. మరి, షీయర్ వాల్ పరిజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలేమిటంటే..
- మోనోలిథిక్ స్ట్రక్చర్ వల్ల నిర్మాణం ఎంతో బలంగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నికగా నిలుస్తుంది.
భూకంప నిరోధకతను కలిగి ఉంటుంది. - షీయర్ వాల్ తో స్ట్రక్చర్ నిర్మించాక ప్లాస్టరింగ్ చేయనక్కర్లేదు.
- బీములు, కాలమ్‌లు ఎక్కడా కనిపించవు. దీంతో ఇంటి ఇంటీరియర్స్ ఎంతో అందంగా కనిపిస్తాయి.
- నాణ్యత విషయంలో పూర్తి భరోసాగా ఉండొచ్చు.
- ఇందులోని భవనాలు చల్లగా ఉంటాయి మరియు మెరుగైన సౌండ్ ఇన్సులేషన్ కలిగి ఉంటాయి.