ఇంటి ఆవాసాలు, బాల్కనీలలో కూరగాయలు పెంపకం మీద ఆసక్తి గల వారికి అర్బన్ ఫార్మింగ్ పథకం ద్వారా ఈ నెల రెండో శనివారం (08.10) మరియు నాలుగో ఆదివారం (23.10) నాడు రెడ్ హిల్స్ లోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలంగాణ ఉద్యానశాఖ తెలియజేసింది. ఈ శిక్షణలో మిద్దె తోటల సాగు గురించి వివరిస్తారు.
ఇందుకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, స్థలఎంపిక, మొక్కల ఎంపిక, మట్టి మిశ్రమం తయారీ విధానం, విత్తనాల ఎంపిక, సేంద్రీయ ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యము, సేంద్రీయ పద్ధతిలో చీడ, పీడల నివారణ గురించి వివరిస్తారు. ఆ తర్వాత ఉద్యాన శిక్షణ సంస్థ మిద్దె తోట సందర్శన ఉంటుంది. ఆసక్తి గలవారు 9705384384కి వాట్సప్ మెసేజ్ పంపి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఉద్యానశాఖ సంచాలకులు విజయప్రసాద్ తెలిపారు.