రూ.500 జీతంలో కెరీర్ ప్రారంభించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుత ఆస్తులెంతో తెలుసా? ఏకంగా రూ.3,300 కోట్లకు పై మాటే. ఏబీసీఎల్ పెట్టి 1999లో దివాళా తీసిన ఆయన.. అప్పటినుంచి అవిశ్రాంతంగా పని చేసి తిరిగి అత్యంత ధనవంతుల జాబితాలో చేరారు. ఇటీవల 80వ పుట్టినరోజు జరుపుకొన్న సందర్భంగా ‘బచన్ బ్యాక్ టు ది బిగినింగ్’ పేరుతో చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమితాబ్ ఏడాదికి రూ. 60 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తులు రూ.3,396 కోట్లు. అమితాబ్ ఒక సినిమాలో నటించినందుకు రూ.6 కోట్ల పారితోషకం తీసుకుంటారు. అంతేకాదు.. బ్రాండ్ అంబాసిడర్ గా అయితే, రూ.5 కోట్ల వరకు తీసుకుంటారని సమాచారం.
అమితాబ్ రియల్ ఎస్టేట్ సహా పలు స్టార్టప్ వ్యాపారాల్ పెట్టుబడులు కూడా పెట్టినట్టు చెబుతున్నారు. ఆయనకు ముంబైలో నాలుగు బంగ్లాలు ఉన్నాయి. అవి ముల్సా, జనక్, ప్రతీక్ష, వాట్స్ లో ఉన్నాయి. ముంబై జుహూ ప్రాంతంలోని జల్సాలోని బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఈ బంగ్లా విలువే దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
బచ్చన్ బంగ్లాలో వేసిన ‘షాహెన్ షా’ పెయింటింగ్ ధర రూ.4 కోట్లు. లెక్సస్, రోల్స్ రాయల్ ఫాంటమ్, రెండు బీఎండబ్ల్యూలు, 3 మెర్సిడెస్ సహా మొత్తం 11 లగ్జరీ కార్లు ఉన్నాయి. మన దేశంలో సొంత జెట్ విమానం ఉన్నసెలబ్రిటీల్లో అమితాబ్ ఒకరు. ఆయన ప్రైవేట్ జెట్ ఖరీదు రూ.260 కోట్లు. 1999లో బెంగళూరులో జరిగిన మిస్ వరల్డ్ పోటీని నిర్వహించడానికి అమితాబ్ చాలా ఖర్చు చేశారు. కానీ కొన్ని సంస్థల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ఆ కార్యక్రమం రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన తీవ్రంగా నష్టపోయి దివాళా తీశారు. ఆ సమయంలో తన కుమారుడు అభిషేక్ బచ్చన్ కాలేజీ ఫీజు కూడా కట్టలేకపోయినట్టు ఓ సందర్భంలో చెప్పారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అత్యధిక ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. 80 ఏళ్ల వయసులో కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.