poulomi avante poulomi avante

ప్లాట్లపై అద్దెకు హామీ

  • రియల్ లో కొత్త ట్రెండ్ కు జీ స్క్వేర్ శ్రీకారం
  • చెన్నై, కొయంబత్తూరు, తిరుచ్చిలోని ప్రాజెక్టులపై ఆఫర్

రియల్ ఎస్టేట్ రంగంలో ఓ నూతన ఒరవడికి జీ స్క్వేర్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అపార్ట్ మెంట్ల కొనుగోలుపై అద్దె హామీ ఇస్తుండగా.. దేశంలోనే తొలిసారి ప్లాట్ల కొనుగోలుపై అద్దె హామీ ఇవ్వడానికి జీ స్క్వేర్ సిద్ధమైంది. చెన్నై, కొయంబత్తూరు, తిరుచ్చిలోని కొన్ని ప్రాజెక్టులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది. ఇందులో కొయంబత్తూరులోని జీ స్క్వేర్ గ్రీన్ వ్యాలీ, జీ స్క్వేర్ మాంచెస్టర్, చెన్నైలోని జీ స్క్వేర్ ఆర్కిడ్ విల్లే, జీ స్క్వేర్ నార్తర్న్ యాలీసహా మరికొన్ని ప్రాపర్టీలు ఉన్నాయి.

ఆఫర్ లో భాగంగా ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు మొదటి 12 నెలలకు చెన్నైలో రూ.75 వేల వరకు, తిరుచ్చిలో రూ.15వేల వరకు, కొయంబత్తూరులో రూ.30 లక్షల నుంచి రూ.4 కోట్ల మధ్యలో ఉన్న ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్లపై నెలకు రూ.4 లక్షల వరకు అద్దె లభిస్తుంది. ‘అపార్ట్ మెంట్ కొనుగోలుపై అద్దె ఇస్తారని అందరికీ తెలుసు. కానీ ప్లాట్ల అభివృద్ధి కోసం మేం తీసుకొచ్చిన ఈ ఆఫర్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మొదటిసారి. రియల్ రంగంలో ఇదో కొత్త ఒరవడి.

ఈ ఆఫర్ దీపావళి సందర్భంగా మా కొనుగోలుదారులకు మేం ఇచ్చే హృదయపూర్వక బహుమతి. ఇది చెన్నైలోని ఎనిమిది గేటెడ్ ప్లాట్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, కొయంబత్తూరులోని ఐదు గేటెడ్ ప్లాట్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, తిరుచ్చిలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాజెక్టులకు వర్తిస్తుంది’ అని జీ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈశ్వర్ ఎన్ తెలిపారు. ఈ ఆఫర్ ప్రకటించిన వెంటనే భారీగా ఎంక్వైరీలు వస్తున్నట్టు చెప్పారు. కొనుగోలుదారుల లబ్ది కోసం ఈ ఆఫర్ పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles