నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్ హెచ్ బీ) జారీ చేసిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆదేశాల్లోని కొన్ని నిబంధనలు పాటించనందుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూ.5 లక్షల జరిమానా విధించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంకు చట్టం, 1987 ప్రకారం ఆర్బీఐకి ఉన్న అధికారాల మేరకు ఈ జరిమానా విధించినట్టు రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ‘నోటీసుకు కంపెనీ ఇచ్చిన సమాధానం, అది సమర్పించిన ఇతర వివరాలు, వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన మౌఖిక సమర్పలను పరిశీలించిన తర్వాత చట్టబద్ధమైన ఆదేశాలను సంస్థ పాటించలేదని ఆర్బీఐ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో జరిమానా విధించింది’ అని పేర్కొంది. ఈ చర్య వల్ల కంపెనీ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవీ ప్రభావితం కావని స్పష్టం చేసింది.