poulomi avante poulomi avante

నిర్మాణ కార్మికుల కోసం ఇళ్ల పథకం

తమిళనాడు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేసుకున్న సభ్యుల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొత్త ఇళ్ల పథకాన్ని ప్రకటించారు. పథకంలో భాగంగా లబ్దిదారుల ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.4 లక్షలు రాయితీ ఇవ్వనున్నారు. తొలి విడతలో భాగంగా రూ.400 కోట్లతో 100 మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తింపజేస్తారు. మొత్తమ్మీద ఏటా దాదాపు 10వేల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తమిళనాడు నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు. కార్మికుల పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఈ బోర్డు సహకారం అందిస్తుంది. 2021 మే నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 4 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.322 కోట్ల మేర సహాయం అందించారు. అదే సమయంలో దాదాపు 7.1 లక్షల మందికి పైగా బోర్డులో తమ పేరు నమోదు చేసుకున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles