ఫ్లాట్ కొనుగోలుదారులకు నిర్మాణ అనుమతులు ఎంతవరకు వచ్చాయో తెలియజేయాలని రెరా అథారిటీ బిల్డర్లను ఆదేశించింది. ప్రస్తుతం బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. కేవలం ఆరంభ అనుమతిని మాత్రమే చూపెడతారు. అంతే తప్ప దశలవారీగా వచ్చే అనుమతుల గురించి కొనుగోలుదారులకు చూపెట్టరు. ఉదాహరణకు బిల్డర్ ఒక ఆకాశహర్మ్యం నిర్మిస్తున్నారంటే.. తొలుత ఐదు అంతస్తులు లేదా కొన్ని అంతస్తుల వరకే అనుమతినిస్తుంది.
అంతేతప్ప ఒకేసారి ఆ ప్రాజెక్టు మొత్తానికి అనుమతిని మంజూరు చేయదు. అయితే, ఈ విషయం చాలామంది కొనుగోలుదారులకు తెలియదు. వారేం అనుకున్నారంటే.. ఒకసారి అనుమతి వచ్చిందంటే.. అది మొత్తం ప్రాజెక్టుకు వర్తిస్దుందనే అపోహలో ఉంటారు. ఈ అంశాన్ని గుర్తించిన మహారాష్ట్ర రెరా అథారిటీ ఇక నుంచి దశల వారీగా వచ్చే అనుమతి వివరాల్ని కొనుగోలుదారులకు చూపెట్టాలని ఆదేశించింది.
* ఫ్లాట్ లావాదేవీల గురించి కొనుగోలుదారులకు మరింత స్పష్టత ఇవ్వమని రెరా బిల్డర్లను కోరింది.
“ఫ్లాట్లు / ప్లాట్ల యొక్క బహుళ లావాదేవీలను నివారించడానికి, అమ్మకం ముగిసిన వెంటనే లేదా బుకింగ్ చేసిన వెంటనే సమాచారాన్ని అందించడం అవసరం” అని ఇది తెలిపింది. తమ ఫ్లాట్ కొనుగోలుదారుల జాబితాను తమతో పాటు సూక్ష్మంగా సమర్పించాలని ఇంతకుముందు బిల్డర్లను ఆదేశించింది
* ప్రాజెక్ట్ పూర్తయిన తేదీని పొడిగించాలని కోరుకుంటే బిల్డర్‌కు కనీసం 51% కొనుగోలుదారుల అనుమతి అవసరం. తాజాగా వారి పేర్లు, ఫ్లాట్ నంబర్లు మరియు సంతకాలతో కూడిన అనుమతి అవసరమని రెరా అథారిటీ స్పష్టం చేసింది. మంజూరు చేసిన ప్లానులో మార్పులు, ఫ్లాట్లను బుక్ చేసుకున్న వారిలో మూడింట రెండొంతుల మంది కొనుగోలుదారుల సమ్మతి అవసరం. ప్రమోటర్ లెటర్‌హెడ్‌లో ప్రతి ఒక్కరూ వారి పేర్లు మరియు ఫ్లాట్ నంబర్లతో సంతకం చేయాల్సి ఉంటుంది.