భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కొహ్లీ గురువారం మణికొండలో హల్చల్ చేశారు. పైపులైను రోడ్డులో గల హాల్‌మార్క్ హబ్‌లోని హైకీ ఫిట్‌నెస్ స్టూడియోకి విచ్చేశారు. సుమారు పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. అత్యాధునికంగా డిజైన్ చేసిన ఈ జిమ్‌లో దాదాపు రెండు గంటల సేపు ఉన్నారు. ఓ సంస్థ వ్యాపార ప్రకటనను ఇక్కడే షూట్ చేశారు. షూట్ ముగిసిన తర్వాత హైకీ ఫిట్‌నెస్ స్టూడియోని ఆరంభించిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ మనీషాతో ముచ్చటిస్తూ.. హైకీ జిమ్‌ను ప్రశంసించారు.
విరాట్ కొహ్లీ మణికొండకు విచ్చేశారనే వార్తను తెలుసుకున్న అభిమానులు.. హాల్‌మార్క్ హబ్ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా హాల్ మార్క్ ఇన్ఫ్రాకాన్ ఎండీ గోపాల కృష్ణ మాట్లాడుతూ.. నగరవాసులకు ఆరోగ్యంపై శ్రద్ధ గణనీయంగా పెరిగింది. అందుకే యూత్‌కు అన్నివిధాల నప్పేలా ఆధునిక ఫిట్‌నెస్ స్టూడియో హైకీని డిజైన్ చేశాం. ఈ బృందానికి యువ వ్యాపారవేత్త మనీషా నాయకత్వం వహిస్తున్నారు, ఆమె ఫిట్‌నెస్ పరిశ్రమలో మూస పద్ధతులకు స్వస్తి చెప్పి.. ఫిట్‌నెస్ ప్రియులకు ఒక అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో హైకీని తీర్చిదిద్దారని తెలిపారు.