ఘట్కేసర్.. ఒకప్పుడు ఇది నగరానికి చాలా దూరం. కానీ ఇప్పుడు దాదాపుగా ఇది కూడా హైదరాబాద్ లో అంతర్భాగం. అంతేకాదు.. సరసమైన ధరలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఉన్న చక్కని మార్గం. నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువ ధరకు ప్లాట్లు, ఫ్లాట్లు లభిస్తుండటమే ఇందుకు కారణం. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లుక్ ఈస్ట్ పాలసీ కూడా ఘట్కేసర్ వైపు అడుగులు వేసేలా చేస్తోంది. ఇంకా పోచారం క్యాంపస్ లో ఇన్ఫోసిస్ విస్తరణ కూడా ఇక్కడ స్తిరాస్థి అభివృద్ధికి దోహదం చేస్తోంది.
పలువురు డెవలపర్లు ఇప్పటికే ఘట్కేసర్ సమీపంలో అపార్ట్ మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్లు నిర్మించారు. హైదరాబాద్-వరంగల్ హైవేపై పారిశ్రామిక కారిడార్ ను కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ఇది ఆమోదం పొందితే ఘట్కేసర్ లో రియల్ భూమ్ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఘట్కేసర్ లో ఫ్లాట్ల ధర చదరపు అడుగుకు రూ.4వేల నుంచి రూ.4500 వరకు ఉంది. 1200 చదరపు అడుగుల 2 బీహెచ్ కే ఫ్లాట్ రూ.50 లక్షల్లో వస్తుంది. ఇక ప్లాట్ల విషయానికి వస్తే చదరపు గజం రూ.40 వేలకు లభిస్తోంది.