poulomi avante poulomi avante

త‌గ్గిన కొత్త ప్రాజెక్టులు.. పెరిగిన అమ్మ‌కాలు..

No New Launches in Hyderabad, Whereas sales are increased.

2023 తొలి త్రైమాసికంలో హైదరాబాద్ రియల్ పరిస్థితి ఇదీ

 

హైదరాబాద్ రియల్ మార్కెట్ నిలకడగా ముందుకెళ్తోంది. 2023 తొలి త్రైమాసికంలో 14,600 యూనిట్లు కొత్తగా లాంచ్ అయ్యాయి. గత త్రైమాసికంతో పోలిస్తే మూడు శాతం తగ్గినప్పటికీ అమ్మకాల పరంగా చక్కని పురోగతి కనిపించింది. 2023 తొలి త్రైమాసికంలో 14,300 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది అంతకుముందు త్రైమాసికం కంటే 24 శాతం అధికం కావడం విశేషం. ఇక అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ 83,700 యూనిట్లు. గత త్రైమాసికంతో పోలిస్తే ఇందులో ఎలాంటి తేడా లేదు. ఇక హైదరాబాద్ మార్కెట్ లో సగటు అమ్మకం ధర చదరపు అడుగుకు రూ.4,800గా ఉంది. ఈ వివరాలను ప్రముఖ రియల్ ఎస్టట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలివీ..

కొత్త లాంచ్ ల విషయంలో హైదరాబాద్ 2022 క్యూ4తో పోలిస్తే కాస్త వెనకబడింది. 2023 క్యూ1లో 14,600 కొత్త యూనిట్లు లాంచ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాలలోని కొత్త లాంచ్ లలో ఇది 13 శాతం కాగా, త్రైమాసికాలవారీగా మూడు శాతం తక్కువ. వార్షికంగా చూస్తే 32 శాతం క్షీణత నమోదైంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఒక్కటే కొత్త లాంచ్ లలో వెనకబడింది.

హైదరాబాద్ జోన్లవారీగా చూస్తే 2023 క్యూ1లో వెస్ట్ లో 37 శాతం, నార్త్ లో 30 శాతం, సౌత్ లో 26 శాతం, ఈస్ట్ లో 7 శాతం కొత్త లాంచ్ ల వాటా కలిగి ఉన్నాయి.

కొత్త లాంచ్ లలో లగ్జరీ రెసిడెన్షియల్ సెగ్మెంట్ అత్యధికంగా 34 శాతం వాటా కలిగి ఉండగా.. హై ఎండ్ కేటగిరీ 27 శాతంతో ఉంది. అందుబాటు ధరలో హౌసింగ్ కేవలం 2 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
అమ్మకాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లోని మొత్తం విక్రయాల్లో హైదరాబాద్ వాటా 13 శాతంగా నమోదైంది. 2023 క్యూ1లో 14,300 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం అధికం. వార్షికంగా ఇది 9 శాతం ఎక్కువ.

2023 క్యూ1లో వెస్ట్, నార్త్ హైదరాబాద్ లోనే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. విక్రయాల్లో వెస్ట్ వాటా 55 శాతం ఉండగా.. నార్త్ వాటా 35 శాతం. ఇక సౌత్, ఈస్ట్ జోన్లు చెరో ఐదు శాతం వాటాతో ఉన్నాయి.

2023 క్యూ1లో అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ నిలకడగా ఉంది. పాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్ ఇన్వెంటరీ వాటా 13 శాతంగా ఉంది. వార్షికంగా ఇది 17 శాతం అధికం

2022 క్యూ1లో 71,200 యూనిట్లు ఉండగా.. 2023 క్యూ1లో అది 83,700కి చేరింది. అదే 2022 క్యూ4తో పోలిస్తే 2023 క్యూ1లో ఎలాంటి మార్పూ లేదు.

ఇన్వెంటరీపరంగా కూడా వెస్ట్ హైదరాబాద్ దే అగ్రస్థానం. హైదరాబాద్ మొత్తం ఇన్వెంటరీలో వెస్ట్ వాటా 57 శాతం కాగా, నార్త్ వాటా 27 శాతం. సౌత్ ది 9 శాతం కాగా, ఈస్ట్ వాటా 5 శాతంగా ఉంది. మొత్తం ఇన్వెంటరీలో హై ఎండ్ యూనిట్ల వాటా 61 శాతంగా ఉంది.

హైదరాబాద్ లో అద్దెల విలువలు కూడా స్వల్పంగా పెరిగాయి. గచ్చిబౌలిలో సగటు నెలసరి అద్దె రూ.22వేల నుంచి రూ.35 వేల మధ్యలో ఉంది. త్రైమాసికంగా 8 శాతం పెరుగుదల కనిపించింది. కొండాపూర్ లో రూ.20వేల నుంచి రూ.26వేల మధ్యలో, మియాపూర్లో రూ.15వేల నుంచి రూ.21 వేల మధ్యలో, ఎల్బీ నగర్ లో రూ.10వేల నుంచి రూ.15వేల మధ్యలో, ఆదిభట్లలో రూ.12వేల నుంచి రూ.16వేల మధ్యలో అద్దెలు ఉన్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles