దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో 10 శాతం వరకు పెరుగుదల
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల పెంపు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు కూడా పెరుగుతన్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో క్యూ-2లో ఇళ్ల ధరలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 6 నుంచి 10 శాతం వరకు పెరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. హైదరాబాద్ లో అత్యధికంగా 10 శాతం మేర ధరలు పెరిగాయి. ఇక్కడ సగటున చదరపు గజం ధర రూ.4,980గా ఉంది. ఈ ఏడాది తొలి అర్ధభాగం రియల్ రంగానికి బాగనే ఉందని.. వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం హౌసింగ్ మార్కెట్ పై పడలేదని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. 2023 ద్వితీయ అర్ధభాగంలోనూ ఈ డిమాండ్ ఇలాగే కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని ఏడు నగరాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం కూడా 25 శాతం పెరిగి 1,02,620 యూనిట్లకు చేరింది. అదే సమయంలో అమ్మకాలు బాగుండటంతో ఇళ్ల స్టాక్ 2 శాతం తగ్గి 6.14 లక్షల యూనిట్లకు చేరింది.