poulomi avante poulomi avante

కలల ఇంటికి కావాలి బీమా

సొంతిల్లు.. అనేది ప్రతి ఒక్కరి కల. అయితే కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిల్లు కొనుక్కోవడమే కాదు.. ఆ ఇంటికి బీమాతో రక్షణ పొందాలని సూచిస్తున్నారు నిపుణులు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తో పాటు ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా మన కలల ఇంటికి బీమా చేయించాలని చెబుతున్నారు. మరి మార్కెట్ లో గృహ రుణ భీమాతో పాటు ఇంటికి చేయించాల్సిన బీమాల్లో ఏవేవి అందుబాటులో ఉన్నాయంటే..
యో తెలుసుకుందామా..

పైసా పైసా కూడబెట్టి, దానికి తోడు బ్యాంకు రుణం తీసుకుని చాలా మంది ఇంటిని కోనుగోలు చేస్తారు. మరి ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. అయితే ఇంటిని కొనగానే సరిపోదు, ఆ ఇంటికి పూర్తి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ రంగ నిపుణులు. మన కలల ఇంటికి బీమాతో సెక్యూరిటీ కల్పించవచ్చని చెబుతున్నారు. ఇంటి కోసం రుణాన్ని తీసుకున్న ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయినా, శాశ్వత అంగవైకల్యం పొందినా, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల వంటిని సంభవించినప్పుడు ఆర్ధికంగా ఇంటి బీమా ఎంతో సహాయపడుతుంది. అందుకే హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల ప్రమాదాలను నుంచి మన ఇంటిని రక్షించుకునేందుకు మార్కెట్‌లో అనేక రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మన అవసరం, పరిస్థితులను బట్టి మన ఇంటికి ఏది సరిపోతుందనుకుంటే దాన్ని ఎంచుకోవాలి.

మార్కెట్ లో అందుబోటులో ఉన్న పాలసీల్లో హోమ్ లోన్ బీమా ప్రదానమైంది. ఇంటి కొనుగోలు కోసం సాధ్యమైనంత వరకు అంతా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. అందుకే సదరు ఇంటి రుణానికి సంబందించిన బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలసీ వల్ల గృహ రుణం తీసుకున్న ఇంటి యజమానికి ఆకస్మిక మరణం సంబవించినా, ప్రమాదంలో అంగవైకల్యం చెందినా సదరు బీమా ద్వార మిగిలిన లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది. ఇప్పుడున్న హౌజ్ లోన్ పాలసీల ప్రీమియం మొత్తం లోన్ లో సుమారు ఒక శాతంగా ఉంది. కాబట్టి ఇంటి రుణానికి బీమా చేయించడం పెద్ద భారం ఏమీకాదని నిపుణులు చెబుతున్నారు.

ఆ తరువాత సమగ్ర ఇంటి పాలసీ ముఖ్యమైంది. ఇంటికి ఈ బీమా తీసుకుంటే ఇల్లు, అందులో సామగ్రి, ఇంట్లో నివసించేవారికి రక్షణ లభిస్తుంది. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదం, దొంగతనం వంటివి జరిగినప్పుడు ఈ పాలసీ పూర్తి లక్షణ కల్పిస్తుంది. ఇంటి విలువ, ప్రాంతం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా కవరేజ్ లభిస్తుంది. అయితే కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదని నిపుణులు చెబుతున్నారు.

ఇన్యూరెన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో పాలసీ హోం కంటెంట్‌ ఇన్సూరెన్స్‌. ఇంట్లో ఉన్న సామగ్రి, ఉపకరణాలు, పరికరాలు పోయినా లేక దెబ్బతిన్నా ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఆభరణాలతో పాటు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి ఉపకరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా వాటి మార్కెట్‌ ధరను బట్టి బీమా వర్తిస్తుంది.
ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్బాల్లో బీమా కావాలనుకుంటే స్ట్రక్చరల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవచ్చు. దొంగతనాలు, ఉగ్రదాడుల వంటి సమయంలో ఇంటి నిర్మాణానికి ముప్పు వాటిల్లితే ఈ పాలసీ ద్వారా బీమా పొందవచ్చు. పైకప్పు, ఇంటి నేల, కిచెన్‌.. ఇలా ఎక్కడ నిర్మాణం దెబ్బతిన్నా పరిహారం లభిస్తుంది. వాతావరణ మార్పులు, విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ లు సహా ఇతర అవాంఛనీయ సంఘటనల కారణంగా ఈ మధ్య అగ్నిప్రమాదాలు పెరిగిపోయాయి. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా అగ్నిప్రమాద బీమా పాలసీ అందుబాటులో ఉంది. అంతే కాకుండా ప్రత్యేకంగా దొంగతనాల నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీలూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో నుంచి దొంగతనానికి గురైన వస్తువులకు వాటి మార్కెట్‌ విలువను బట్టి బీమా అందజేస్తారు. అయితే ఇంటి కోసం ఏ పాలసీ తీసుకున్నా ముందుగా వాటి నియమ నిబంధనలు, ఫీచర్లు, ప్రీమియం వంటి వివరాలను పరిశీలించాలి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles