కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రియల్ రంగం పరంగా సమతుల్యమైనదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక ఉత్పాతాలను భారత్ వివేకంతో ఎదుర్కొందని చెప్పొచ్చు.
మూలధన వ్యయాలను రూ. 10 లక్షల కోట్ల వరకు మౌలిక వసతుల రంగంలో పెంచడం భారత దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడే నిర్ణయం అని చెప్పొచ్చు. డిజిటల్ అడాప్షన్, గ్రీన్ ఎకానమీ కోసం తీసుకున్న చర్యలు సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీ కేటాయింపులు కచ్చితంగా అందుబాటు గృహాలకు ఊతమిస్తాయని నిపుణులు అంటున్నారు. రీట్ల విషయంలో మూలధన రాబడిపై పన్ను విధించడం వల్ల రీట్లపై పంపిణీ నమూనాలను పన:పరిశీలించాల్సి వస్తుందన్నారు. ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచడం, అన్ని స్లాబ్ లలో పన్ను తగ్గింపు కచ్చితంగా మార్కెట్లలో మరింత లిక్విడిటీని పంపింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఇది రియల్ రంగం వృద్ధి అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది. వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పించే రెండో అతిపెద్దం రంగమైన రియల్ ఎస్టేట్ కు ఈ బడ్జెట్ మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాల కల్పన, పటిష్టమైన మౌలిక సదుపాయాలను కల్పించే, ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించే ప్రగతిశీల బడ్జెట్ అని చెప్పొచ్చు.
* ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి 66 శాతం నిధులు పెంచడం స్వాగతించాల్సిన విషయం. కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబ్ ల హేతుబద్ధీకరణ స్వాగతించాల్సిన విషయం. డిజిటలైజేషన్ ను పెంచడానికి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి తీసుకుంటున్న చర్యలను స్వాగతించాల్సిందే. తాజా బడ్జెట్ అనేక రంగాలకు సానుకూలంగా ఉంది. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, హరిత లక్ష్యాలను చేరుకోవడం, మధ్యతరగతి ప్రజలకు పన్ను ఉపశమనం, ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడం వంటి వాటిపై దృష్టి పెట్టింది.
This website uses cookies.