Categories: LATEST UPDATES

సేల్ డీడ్ అమల్లో విఫలం  బిల్డర్ కు జరిమానా

ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించిన సేల్ డీడ్ లను అమలు చేయడంలో విఫలమైనందుకు ఓ నిర్మాణ సంస్థకు థానే జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున 45 మందికి పరిహారం చెల్లించాలని పరంజాపే కన్ స్ట్రక్షన్ కంపెనీని ఆదేశించింది.
1986లో మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో కంపెనీ హౌసింగ్ స్కీమ్ లో 410 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లను పలువురు బుక్ చేసుకున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు రూ.95 వేల చొప్పున చెల్లించారు. అయితే, వారు ఆయా ఫ్లాట్లలో నివసిస్తున్నప్పటికీ కంపెనీ మాత్రం ఇప్పటివరకు సేల్ డీడ్ అమల చేయలేదు. దీంతో వారంతా తొలుత కంపెనీకి నోటీసులిచ్చారు. అయినప్పటికీ కంపెనీ స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. వాదనలు విన్న కమిషన్.. ఒక్కొక్కరికీ రూ.30 వేల పరిహారం చెల్లించడంతో పాటు వెంటనే సేల్ డీమ్ అమలు చేయాలని ఆదేశించింది.

This website uses cookies.