Categories: Celebrity Homes

రూ.71 కోట్లతో బంగ్లా కొన్న జాన్ అబ్రహం

ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ముంబై ఖర్ ప్రాంతంలో బంగ్లా కొన్నారు. దాదాపు వెయ్యి గజాల స్థలంలో నిర్మించిన ఈ బంగ్లాను రూ.70.83 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. 372 నిర్మల్ భవన్ పేరుతో ఉన్న ఈ భవంతిని గ్రౌండ్, రెండంతస్తుల్లో 5,416 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒకే కుటుంబానికి చెందిన పది మంది నుంచి జాన్ అబ్రహం ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.4.25 కోట్ల స్టాంపుడ్యూటీ చెల్లించారు. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 27న జరిగింది. జాన్ అబ్రహం ప్రస్తుతం 4వేల చదరపు అడుగుల విల్లా ఇన్ ద స్కై అనే పెంట్ హౌస్ లో ఉంటున్నారు. ఇది బాంద్రా వెస్ట్ లో 7, 8వ అంతస్తుల్లో ఉంది. కాగా, జాన్ నటుడే కాకుండా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇంటర్నెట్ సర్వీసెస్, ఫుడ్ అండ్ బేవరేజెస్, కమ్యూనిటీ, ఫిట్ నెస్, లైఫ్ స్టైల్ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ఇండియన్ సూపర్ లీగ్ లో ఓ ఫుట్ బాల్ టీమ్, హాకీ ఇండియా లీగ్ లో ఓ టీమ్ కు యజమానిగా ఉన్నారు.

This website uses cookies.