మేరీగోల్డ్ ప్రాజెక్టు పేరుతో తమను మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో ఏటీఎస్ ఇన్ ప్రాస్టక్చర్ డైరెక్టర్లు, ప్రమోటర్లపై ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 1860 మంది వ్యక్తులు తాము ఈ ప్రాజెక్టులో రూ.12.9 కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్గావ్ సెక్టార్ 89ఏలో హర్సారు గ్రామంలోని 11.1 ఎకరాల స్థలంలో చేపట్టిన మేరీగోల్డ్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టువారి కోసం చూస్తున్నట్టు ఏటీఎస్ డైరెక్టర్ గెటాంబర్ ఆనంద్ పేర్కొన్నట్టు ఫిర్యాదులో వివరించారు. అంతేకాకుండా బై బ్యాక్ స్కీమ్ ద్వారా నిర్దేశిత కాలావధి తర్వాత ఆయా ఫ్లాట్లను తామే కొనుగోలు చేస్తామని కూడా చెప్పారని.. దీంతో తామంతా పెట్టుబడి పెట్టి మోసపోయామని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోందని, ఇంకా ఎలాంటి అరెస్టులూ చేయలేదని పోలీసులు తెలిపారు.
This website uses cookies.