Categories: LATEST UPDATES

స్వదేశం వైపు ప్రవాసుల చూపు

హౌసింగ్ లో 35 శాతం మేర
పెరిగిన ఎన్నారైల పెట్టుబడులు

ప్రవాస భారతీయుల చూపు స్వదేశం వైపు పడింది. వారు ఇప్పటికిప్పుడు ఇండియా రాకున్నా.. ఇక్కడ ప్రాపర్టీ కొనుగోళ్లకు విశేష ఆసక్తి కనబరుస్తున్న విషయం తాజాగా వెల్లడైంది. మనదేశ హౌసింగ్ రియల్ ఎస్టేట్ లో ఎన్నారైలు పెట్టుబడులు సంవత్సరానికి 35 శాతం మేర పెరిగినట్టు తేలింది. అనేక సౌకర్యాలు అందించే గేటెడ్ కమ్యూనిటీల వైపే ఎన్నారైలు మొగ్గు చూపిస్తున్నారు. అద్దె ఆదాయం కూడా భారీగా వస్తుండటంతో చాలామంది ఇక్కడ ప్రాపర్టీల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ఎన్నారైల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. తర్వాత స్థానాల్లో సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నారైలు తమ కోసం లేదా అద్దె ఆదాయం కోసం ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. అదే సమయంలో తమ తల్లిదండ్రులు లేదా తాతల కోసం సీనియర్ లివింగ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ ప్రాపర్టీలు సాధారణంగా ఆస్పత్రులకు సమీపంలో, ఏదైనా జరిగితే వెంటనే వైద్య చికిత్స లభించే ఏర్పాట్లు ఉండటంతో వీటిపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు 3 బీహెచ్ కే యూనిట్లకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీల్లో ఇంతకుముందు 2 బీహెచ్ కేలను ఇష్టపడగా.. ఇప్పుడు 3 బీహెచ్ కేలకు ఓటేస్తున్నారు. హైబ్రిడ్ వర్క్ కల్చర్ నేపథ్యంలో ఎక్కువ స్థలం అవసరం కాబట్టి.. 3 బీహెచ్ కేలను ఎంచుకుంటున్నారు

This website uses cookies.