Categories: ReraUncategorized

రిటర్నులు ఫైల్ చేయలేదని బిల్డర్ల ఖాతాల స్తంభన..

త్రైమాసిక రిటర్నులు ఫైల్ చేయని బిల్డర్లపై రెరా కన్నెర్ర చేసింది. దాదాపు 40 ప్రాజెక్టులకు చెందిన బిల్డర్ల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. ఒక్కో ప్రాజెక్టు పేరిట ఈ ఎస్క్రో ఖాతాను బిల్డర్లు ఓపెన్ చేశారు. అయితే, త్రైమాసికంగా రిటర్నులు దాఖలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వీటిని స్తంభింపచేస్తూ రెరా నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి బిల్డర్ల ఖాతాలను స్తంభింపచేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఖాతాలు స్తంభింపచేసిన ప్రాజెక్టు వివరాలను త్వరలోనే తన వెబ్ సైట్ లో పెట్టనుంది. నిబంధనల ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి కొనుగోలుదారుల నుంచి వచ్చిన మొత్తంలో 70 శాతాన్ని ఈ ఖాతాలో జమ చేయాలి. ఈ సొమ్మును నిర్మాణ కార్యకలాపాలకు మాత్రమే వెచ్చించాలి. నిధులు దారి మళ్లకుండా చేసేందుకే ఈ ఖాతాలను ఓపెన్ చేయాలని రెరా నిర్దేశించింది. అలాగే రెరా నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఓసారి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రెరాకు సమర్పించాలి. ఎంత పని అయింది, ఎన్ని ఫ్లాట్లు అమ్ముడయ్యాయి, నిర్మాణానికి ఇప్పటివరకు ఎంత మొత్తం వెచ్చించారు వంటి వివరాలు ఇవ్వాలి. అయితే, పలువురు బిల్డర్లు ఈ సమాచారం సమర్పించలేదు. తొలుత వారందరికీ మ‌హా రెరా నోటీసులిచ్చింది. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఎస్క్రో ఖాతాలను స్తంభింపచేసింది.

This website uses cookies.