Categories: LATEST UPDATES

సంపన్నులకు ఇల్లే ఇంపార్టెంట్

  • 32 శాతం సంపదను ఇళ్ల
    కొనుగోలుకే కేటాయింపు
  • నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడి

దేశంలో అత్యంత సంపన్న వర్గానికి చెందిన వ్యక్తులు ఇళ్లకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. వీరంతా తమ సంపదలో 32 శాతాన్ని దేశ విదేశాల్లో ఇళ్ల కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. 30 మిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తులు తమ సంపాదనంలో 32 శాతం మొత్తాన్ని రెసిడెన్షియల్ ప్రాపర్టీల కొనుగోలు కోసం కేటాయిస్తున్నట్టు ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ తన నివేదికలో వెల్లడించింది. సగటున ఓ భారతీయ అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్ (యూహెచ్ఎన్ డబ్ల్యూఐ) 2.57 ఇళ్లను కలిగి ఉండగా..

28 శాతం మంది 2023లో తమ రెండో ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు నివేదిక తెలిపింది. అలాగే దాదాపు 12 శాతం మంది 2024లో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పింది. గతేడాది కూడా 12 శాతం మందే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల్లో 22 శాతం మంది 2024లో రెండో ఇంటిని కొనుగోలు చేస్తారని అంచనా. అత్యంత సంపద కలిగిన వ్యక్తులకు రెసిడెన్షియల్ ప్రాపర్టీలే ప్రధాన పెట్టుబడి మార్గాలుగా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు.

This website uses cookies.