Categories: LATEST UPDATES

జేఎన్ఏఎఫ్ఏయూలో కొత్త కోర్సు

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, జవహర్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) కొత్తగా ఎనర్జీ అండ్ సస్టైనబుల్ బిల్ట్ ఎన్విరాన్ మెంట్ లో మాస్టర్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో ఈ కోర్సు ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కవితా దర్యాణిరావు తెలిపారు.

తెలంగాణ వెలుపల కొన్ని సంస్థలు దీనికి సంబంధించిన సబ్జెక్టులను అందిస్తున్నప్పటికీ, తెలంగాణలో అందించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ కోర్సు ప్రారంభం కానుంది. ఇది ఫుల్ టైమ్ కోర్సు. పరిశ్రమ, సబ్జెక్టు నిపుణుల సహకారంతో అందించనున్నారు. 20 మందికి ప్రవేశం పొందే అవకాశం ఉంది.

గ్రీన్ బిల్డింగ్ అనలిస్ట్, రెన్యువబుల్ ఎనర్జీ స్పెషలిస్ట్, ఎన్విరాన్ మెంటల్ పాలసీ అడ్వైజర్, ఎనర్జీ ఎఫిషియెంట్ మేనేజర్, బిల్డింగ్ ఇన్ స్పెక్టర్, సస్టైనబుల్ మెటీరియల్స్ రీసెర్చర్, కార్బన్ ఫుట్ ప్రింట్ అనలిస్ట్, క్లైమేట్ రెసిలెన్స్ ప్లానర్, సస్టైనబిలిటీ స్పెషలిస్ట్, సస్టైనబిలిటీ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. దరఖాస్తులు ప్రారంభమయ్యాయని.. బీటెక్ లేదా బి డిజైన్, బి ఆర్క్ లో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు పీజీసెట్ లో అర్హత సాధించి ఉండాలని వీసీ తెలిపారు.

This website uses cookies.