Categories: LATEST UPDATES

ప్రాజెక్ట్ ప్రకటనలో క్యూఆర్ కోడ్ త‌ప్ప‌నిస‌రి!

తిరువనంతపురం : రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల విక్ర‌యానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల స‌మ‌యంలో.. ఇక నుంచి క్యూఆర్ కోడ్‌ను త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌ద‌ర్శించాల‌ని కేర‌ళ రెరా అథారిటీ తెలియజేసింది. ఈ నిబంధ‌న‌ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వ‌స్తుందంటూ.. కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇటీవ‌ల ఉత్తర్వుల్ని జారీ చేసింది. దీని ప్ర‌కారం.. రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌క‌ట‌న‌ల్లో రెరా రిజస్ట్రేష‌న్ నెంబ‌రు, చిరునామాతో పాటు క్యూఆర్ కోడ్‌ను త‌ప్ప‌నిస‌రిగా పొందుప‌ర్చాలి. ప్రాజెక్ట్ సైట్, సోషల్ మీడియా, డెవలపర్ వెబ్‌సైట్, వారి కార్యాలయం మొదలైన వాటితో సహా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, బ్రోచర్‌లు, హోర్డింగుల్లో క్యూఆర్ కోడ్ త‌ప్ప‌నిస‌రి చేసింది. ప్రమోటర్లు రెరా డాష్‌బోర్డు నుంచి తమ ప్రాజెక్టు యొక్క క్యూఆర్ కోడ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది.

కొనుగోలుదారులు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే కేర‌ళ రెరా వెబ్‌సైటులో పొందుప‌ర్చిన ప్రాజెక్టుల స‌మాచారాన్ని చూడ‌టానికి వీలు క‌లుగుతుంది. ఆయా ప్రాజెక్టుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, ఆర్థిక పురోగతి, ప్రజా సౌకర్యాలతో సహా నిర్మాణ పురోగతి, త్రైమాసిక పురోగతి నివేదిక, ఆమోదించిన ప్రణాళికలు మరియు ప్రాజెక్టు తాజా చిత్రాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను తేవ‌డానికే ఈ క్యూఆర్ కోడ్ ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని కేర‌ళ‌-రెరా చైర్మన్ పి.హెచ్. కురియన్ అన్నారు.

This website uses cookies.