Categories: LATEST UPDATES

హైదరాబాద్లో రియల్ జోరు

రెసిడెన్షియల్ డిమాండ్ 98 శాతం పెరుగుదల

హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ రంగం జోరుగా దూసుకెళ్తోంది. 2023 నాలుగో త్రైమాసికంలో రెసిడెన్షియల్ డిమాండ్ 98 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. వార్షిక ప్రాతిపదికన ఇది 49 శాతం వృద్ధి నమోదైంది. అలాగే కొత్త ఇళ్ల సరఫరా నాలుగో త్రైమాసికంలో 9 శాతం పెరిగింది. ముఖ్యంగా తెల్లాపూర్, కోకాపేట, నానక్ రామ్ గూడ వంటి మైక్రో మార్కెట్లలో కొత్త ఇళ్ల సరఫరాలో వృద్ధి నమోదైంది.

కొత్త ఇళ్లలో దాదాపు 76 శాతం యూనిట్లు రూ.కోటి కంటే ఎక్కువ ధర కలిగినవే ఉండగా.. అమ్ముడైనవాటిలో ఈ ధర కలిగినవి 56 శాతం ఉన్నాయని ప్రాప్ టెక్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది. అలాగే 2023 నాలుగో త్రైమాసికంలో హైదరాబాద్ లోని ప్రాపర్టీ మూలధన విలువలు 10 శాతం పెరిగాయి. చదరపు అడుగుకు సగటు ధర రూ.6700 నుంచి రూ.6900 మధ్యలో ఉన్నాయి. మూలధన విలువల్లో 10 శాతం పెరుగుదల దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్ ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా తన స్థానాన్ని పదిలం చేసుకుందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ బిజినెస్ హెడ్ వికాస్ వాధావన్ పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ముఖ్యంగా తెల్లాపూర్, కోకాపేట, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో చాలా రెసిడెన్షియల్ అమ్మకాలు, లాంచ్ లు కేంద్రీకృతమై ఉన్నాయని హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ డాట్ కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2023లో కనిపించిన గరిష్ట డిమాండ్ ను చూస్తే.. రాబోయే త్రైమాసికాల్లో సానుకూలంగానే ఇది కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.

This website uses cookies.