Categories: LATEST UPDATES

పెరుగుతున్న అతివల ఆధిపత్యం

స్థిరాస్తి కొనుగోళ్లలు నిర్ణయాల్లో
పెరుగుతున్న మహిళల పాత్ర

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ రియల్ రంగం ప్రధానంగా పురుషులు ఆధిపత్యంలోనే ఉంది. ఆస్తి లావాదేవీల్లో సాధారణంగా పురుషులు నిర్ణయాధికార పాత్ర పోషిస్తారు. సాంఘిక నిబంధనలు,సంప్రదాయాలు, ఆచారాల వంటివి రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలో మహిళలను రెండో స్థానానికే పరిమితం చేశాయి. అయితే, ప్రస్తుతం ఈ పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా గత దశాబ్దంలో ఇది బాగా మారింది. ప్రస్తుతం దేశంలోని శ్రామికశక్తిలో మహిళలు 33 శాతం మంది ఉన్నారు. వీరిలో చాలామంది ప్రమోటర్లుగా, ఇళ్ల కొనుగోలుదారులుగా రియల్ రంగంలో తమ పాత్ర పోషిస్తున్నారు. వాస్తవానికి ఇంటిని సొంతం చేసుకోవడంలో ఓ వ్యక్తి ఆర్థిక పోర్ట్ ఫోలియో కీలకంగా నిలుస్తుంది. ఇల్లు కొనుగోలులో కీలక నిర్ణయం తీసుకునే విషయంలో మహిళలు చాలాకాలంగా గుర్తింపు పొందారు. అయితే, ఇప్పుడిప్పుడే వారు ప్రాథమిక యాజమాన్యంలోకి మారుతున్నారు.

2020-2023 మధ్యకాలంలో మ్యాజిక్ బ్రిక్స్ ఫ్లాట్ ఫారమ్ లో మహిళా కొనుగోలుదారుల్లో 16 శాతం పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో వారి ప్రమేయం క్రమంగా పెరుగుతోంది. చెన్నై, థానే, బెంగళూరు వంటి నగరాల్లో మ్యాజిక్ బ్రిక్స్ వినియోగదారుల్లో 35 శాతం మంది మహిళలు ఆస్తి యాజమాన్యంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. 2020 నుంచి నవీ ముంబై వంటి ప్రాంతాల్లో అతివల ఆసక్తిలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. దేశంలో మహిళా ఇళ్ల కొనుగోలుదారులు పెరగడానికి అనేక అంశాలు దోహదం చేశాయి. ఆర్థిక సాధికారత, విద్య, లింగ సమానత్వం పట్ల మారుతున్న సామాజిక దృక్పథాల వంటివి మహిళలు తమ ఆర్థిక భవిష్యత్తును నియంత్రించుకోవడానికి, ఆస్తి యాజమాన్యానికి సంబంధించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ఉతమిచ్చాయి. అంతేకాకుండా తక్కువ స్టాంపు డ్యూటీ, పన్ను ప్రయోజనాలు, తక్కువ గృహ రుణ రేట్ల వంటి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా మహిళల ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించాయి.

డెవలపర్లు కూడా మహిళా కొనుగోలుదారుల నిర్దిష్ట అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భద్రత, సామాజిక మౌలిక సదుపాయాలను కల్పించడంతపాటు ఇంటి లేఔట్, డిజైన్ కు సంబంధించి అతివల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పలువురు డెవలపర్లు మహిళల కోసం ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. అలాగే సాంకేతికత సైతం మహిళలకు ఇంటి కొనుగోలు నిర్ణయంలో బాగా ఉపకరిస్తోంది. ప్రాపర్టీని శోధించడం, ఇతర ప్రాపర్టీలతో పోల్చుకోవడం, కొనుగోలుకు సంబంధించి నిర్ణయాన్ని సులభతరం చేసే ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ లు అందుబాటులో ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవంతో సంబంధం లేకుండా మహిళలు నిర్ణయం తీసుకోగలుగుతున్నారు.

This website uses cookies.