- రూ.68 కోట్లకు అపార్ట్ మెంట్ కొనుగోలు
ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో ఖరీదైన డీల్ జరిగింది. వర్లిలో ఓ అపార్ట్ మెంట్ రూ.68 కోట్లకు అమ్ముడైంది. ఓంకార్ రియల్టర్స్ ప్రమోటర్ బాబులాల్ వర్మ భార్య వర్లిలోని ఫోర్ సీజన్స్ ప్రైవేట్ రెసిడెన్సెస్‌లో లగ్జరీ అపార్ట్ మెంట్‌ను రూ.68 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ అపార్ట్ మెంట్ 5,291 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. 310 చదరపు అడుగుల బాల్కనీ ఉంది. ఫోర్ సీజన్స్ ప్రైవేట్ రెసిడెన్సెస్ బ్యానర్ కింద సర్వీస్ అపార్ట్ మెంట్‌లను నిర్మించిన ప్రావిడెన్స్ ల్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అపార్ట్ మెంట్ ను విక్రయించింది. మార్చి 6న రిజిస్ట్రేషన్ జరిగింది. చదరపు అడుగు అమ్మకం ధర రూ.1.29 లక్షలుగా పలికినట్టయింది. రిజిస్ట్రేషన్ కోసం రూ.3.42 కోట్ల స్టాంపు డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. కాగా, ఓంకార్ రియల్టర్స్ నగరంలో అనేక మురికివాడల పునరావాస ప్రాజెక్టులను నిర్మించింది.