Categories: Celebrity Homes

ప్రార్థ‌నే మా ఇంటికి ఆశీర్వాదం

  • ప్రముఖ నటుడు ఆయుష్ శర్మ

ప్రముఖ నటుడు ఆయుష్ శర్మ లివింగ్ రూమ్ చూస్తే వావ్ అనకుండా ఉండలేం. ఓవైపు ముదురు నీలిరంగు వెల్వెట్ మంచాలు కనువిందు చేస్తాయి. ఇవి లివింగ్ రూమ్ సొగసైన అందాన్ని తీసుకొచ్చాయి. అలాగే ఆ గది మధ్యలో పాలిష్ చేసిన బ్లాక్ సెంటర్ టేబుల్ మరో హైలైట్. చాలామంది లాగానే ఆయుష్ శర్మ కూడా వర్కౌట్ ల ద్వారా తన శరీరాన్ని చక్కని ఆకృతిలోకి మార్చుకున్నారు. ఆయన ఇంట్లో జిమ్ కూడా ఉంది.

‘మా ఇంట్లో హ్యారీ పాటర్ ఉన్నాడు. మా పాత కుక్క హాగ్రిడ్.. కొత్తగా వచ్చింది పాటర్. మా ఇంటిని అలంకరిస్తున్నప్పుడు నాకు ఓ భారీ కళాఖండం అవసరమైంది. ఆధ్యాత్మిక శక్తి వ్యాపించే ఓ కళాఖండం ఇవ్వాలని సల్మాన్ భాయ్ ను అడిగాను. ఆయన ముస్లిం ప్రార్థనలో భాగం, నమాజ్ యొక్క వివిధ భంగిమలతో కూడిన అద్భుతమైన కళాఖండాన్ని ఇచ్చారు. ముస్లిం ప్రార్థన మా ఇంటికి ఓ ఆశీర్వాదం’ అని ఆయుష్ పేర్కొన్నారు. బాంద్రాలోని వీధులు చూస్తే.. అక్కడి అన్ని కుటుంబాలకు వేడుకలు చేసుకునేందుకు బాల్కనీ అంటే ఎంతో ఇష్టమని అర్థమవుతుంది. డార్క్ మార్బుల్ ఫ్లోరింగ్, మ్యాచింగ్ బార్ తో ఈ ప్రదేశం కుటుంబం, స్నేహితులతో కలిసి గడపడానికి చక్కగా ఉంటుంది. పలు మొక్కలు, తీగలతో నిండిన బాల్కనీలో హాయిగా కూర్చుని ఎంజాయ్ చేసే ఏర్పాట్లూ ఉన్నాయి.

మరచిపోలేని విధంగా పార్టీలను నిర్వహించడంలో శర్మకు మంచి పేరుంది. తరచుగా ఈ బాల్కనీలో చాలా తాజాగా ఉండే పూలు, డిజర్ట్ స్ప్రెడ్ తో చక్కని మేకోవర్ చేస్తారు. ‘నేను దీనిని మల్టీపర్పస్ ప్లేస్ అని పిలుస్తాను. వర్షంలో భలే ఉంటుంది. అస్సలు తడవరు. వర్షాకాలాన్ని ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. నా బాల్కనీలో చాలా బాలీవుడ్ పార్టీలు జరుగుతుంటాయి. ఇది నా కుటుంబానికి బాంకెట్ హౌస్. నా బాల్కనీలో బ్యాట్ మ్యాన్ కళాఖండాన్ని ఉంచాలనుకుంటున్నాను. కానీ నా భార్య ఒప్పుకోవడంలేదు. లైట్ల కింద కూర్చుని నగరాన్ని తదేకంగా చూస్తున్న బ్యాట్ మ్యాన్ రూపాన్ని ఊహించుకోండి. మా బాల్కనీలో లైట్లు వెలిగిన ప్రతిసారీ శర్మ ఇంట్లో పార్టీ జరుగుతుందనే సంగతి నగరం మొత్తం తెలుసుకోవాలి’ అని ఆయుష్ శర్మ చెప్పారు.

This website uses cookies.