ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఓఏబీఎల్) ప్రీమియం అలీభాగ్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారు. ఈ ప్రాజెక్టులో 2వేల చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు. మాండ్వా జెట్టీ నుంచి 20 నిమిషాల దూరంలో, దక్షిణ ముంబై నుంచి సముద్ర మార్గంలో 60 నిమిషాల దూరంలో ఉన్న అలీబాగ్ అనే సుందరమైన పట్టణంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇటీవల ప్రారంభమైన ఎంటీహెచ్ఎల్ కనెక్టివిటీ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తోంది.
అలీభాగ్ రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యం కావాలనుకునేవారికి ఈ ప్రాజెక్టు ఆకర్షణీయమైన ఎంపిక. ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.. ‘నేను హౌస్ ఆఫ్ అభినందన్ లోథా లో భూ యజమాని అయినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. నేను సొంతంగా ఇక్కడ భూమిని కొనుగోలు చేయడం చాలా సాధికారితగా అనిపిస్తోంది. నా పోర్ట్ ఫోలియోకు గొప్ప పెట్టుబడిని జోడించాను. అలీభాగ్ లో పెట్టుబడి పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం లేదు’ అని పేర్కొన్నారు.
ఇటీవల అమితాబ్ బచ్చన్ కూడా అలీభాగ్ లోని అదే ప్రాజెక్టులో 10వేల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయోధ్యలోని సరయులో 10వేల చదరపు అడుగుల ఫ్లాట్ ను కొనుగోలు చేసిన తర్వాత ఈ పెట్టుబడి పెట్టారు. భారతదేశపు అతిపెద్ద బ్రాండెడ్ ల్యాండ్ డెవలపర్ అయిన హెచ్ఓఏబీఎల్, సోల్ డి అలీభాగ్ తో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇక అలీభాగ్ తన సుందరమైన అందంతోపాటు ముంబైకి సమీపంలోనే ఉండటంతో ఇళ్ల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. దీంతో రాబోయే దశాబ్దంలో ఇది ప్రధాన నివాస ప్రాంతంగా రూపాంతరం చెందుతుందని అంచనా.