దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లల కోసం స్టడీ రూమ్ ఉండటం కామన్. గతంలో ఇందుకు అందరి ఇళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోయినా.. కరోనా తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో స్టడీ రూమ్ ప్రాధాన్యత పెరిగింది. ఇంట్లో ఉండే ఇతరత్రా అంశాలు దరి చేరకుండా ఏకాగ్రత అవసరమైన రూమ్ ఇది. వాస్తు శాస్త్రంలో కూడా స్టడీ రూమ్ కు సంబంధించిన అంశాలున్నాయి. మరి వాస్తు ప్రకారం స్టడీ రూమ్ లో ఏమేం ఉంచితో విద్యార్థులకు మంచిదో చూద్దామా?
1.సరస్వతీ దేవి చిత్రపటం
విద్య అంటే ఠక్కున గుర్తొచ్చేది సరస్వతీ దేవి. జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతీ దేవి కాబట్టి.. స్టడీ రూమ్ లో ఆమె చిత్రపటం ఉంచితే చాలా మంచిది.
2.గాయత్రీ మంత్రం
మీ పిల్లల చదువు, తెలివితేటలు పెంచడానికి గాయత్రీ మంత్రం మరో మార్గం. గాయత్రీ మంత్రం ఉన్న చిత్రాన్ని స్టడీ రూమ్ లో ఉంచడం వల్ల మేలు జరుగుతుందని నమ్మకం.
3.గణేశుడి చిత్రం
విఘ్నాలు తొలగించే గణపతి చిత్రపటం కూడా స్టడీ రూమ్ లో ఉండాల్సినవాటిలో ఒకటి. స్టడీ రూమ్ లో గణనాథుడి విగ్రహం లేదా చిత్రం ఉంచడం వల్ల అభ్యాసనంలో ఎదురయ్యే సవాళ్లను మీ పిల్లలు సులభంగా అధిగమించే అవకాశం ఉంది.
4.గరుడ
విష్ణుమూర్తి వాహనమైన గరుడకు సునిశిత దృష్టి, చక్కని తెలివితేటలు ఉంటాయి. అందువల్ల మీ పిల్లల స్టడీ టేబుల్ పై గరుడ బొమ్మను ఉంచడం ద్వారా వారిలో సునిశిత దృష్టిని, తెలివితేటలు పెంపొందించొచ్చు.
5.నంది
ఆగమశాస్త్రాల్లో దిట్ట అయిన నంది.. పరమ శివుడికి నమ్మకమైన వాహనం. నంది జ్ఞానసంపదను చేరుకోవడం అంత సులభం కాదు. అందువల్ల నంది విగ్రహాన్ని స్టడీ రూమ్ లో ఉంచితే మీ పిల్లల తెలివితేటలు విస్తరించడం ఖాయం.