poulomi avante poulomi avante

శేష జీవితానికి.. తిరుపతి, వైజాగ్ బెటర్

టైర్-1 నగరాల్లో హైదరాబాద్, పుణె

ఎక్కువమంది నెటిజన్లు ఓటు వీటికే

రిటైర్మెంట్ తర్వాత జీవించడానికి అనువుగా ఉండే నగరం ఏది అంటే.. ఎక్కువమంది నెటిజన్లు హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, కొచ్చి, పుణెలకు ఓటేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే ప్రణాళికలు వేసుకునే ఒరవడి 2000 ఆరంభంలోనే మొదలైంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ-ఫైర్ అని దీనికి పేరు.

సాధారణంగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చాలామంది సొంతూళ్లలో జీవించడానికే మొగ్గు చూపించేవారు. అయితే, ప్రస్తుతం ఆ ఒరవడిలో కాస్త మార్పు కనిపిస్తోంది. సొంతూళ్లలో వైద్య, ఇతరత్రా సౌకర్యాలు లేని కారణంగా తమ స్వగ్రామలకు దగ్గరగా ఉండే టైర్-2 నగరాల పట్ల ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో స్థిరపడిన 38 ఏళ్ల వ్యక్తి.. రిటైర్మెంట్ తర్వాత జీవించడానికి అనువైన నగరం ఏదంటూ నెటిజన్లను సలహా అడిగాడు.

‘నేను ఒక సంవత్సరంలో భారతదేశానికి రావాలని అనుకుంటున్నాను. వచ్చే నాలుగైదేళ్లు నా పనులు కొనసాగిస్తాను. నాకు పెద్ద ఇళ్లలో ఉండటం ఇష్టం. అందువల్ల 4వేల నుంచి 5వేల చదరపు అడుగుల విల్లాలో ఉండాలని అనుకుంటున్నారు. రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించాను’ అని పేర్కొన్నారు.

చక్కని నైట్ లైఫ్, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రయాణానికి కనెక్టివిటీ, తక్కువ వేడి వంటి ఐదు అంశాలను బేరీజు వేసుకుంటే చండీగఢ్, గోవా మంచిదని అనిపిస్తోందన్నారు. వాస్తవానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాలను నెటిజన్లు సూచిస్తారని అనుకుంటే.. ఇంటర్నెట్ సమాజం అందుకు విరుద్ధంగా స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, వైజాగ్ తోపాటు కేరళలోని కొచ్చి వంటి ప్రాంతాలను సూచించింది. ‘తిరుపతికి బెంగళూరు, చెన్నైకి మంచి కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ కు 40 నిమిషాల్లో ఫైట్ లో వెళ్లొచ్చు. రెండు గంటల డ్రైవింగ్ తో 3 సముద్ర ఓడరేవులకు చేరుకోవచ్చు. పైగా ఇది సరఫరా గొలుసు కేంద్రంగా ఉంది’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

మరొకరు తిరుపతిని అమెరికాలోని డెన్వర్, జాక్సన్ విల్లేతో పోల్చారు. ఇది చాలామంది రిటైరీలకు నిలయంగా ఉందని.. అధిక పర్యాటక ఆదాయం, ఖరీదైన రియల్ ఎస్టేట్ ను కలిగి ఉందని వివరించారు. ‘గత మూడేళ్లలో తిరుపతిలో మౌలిక వసతులు బాగా అభివృద్ధి చెందాయి. కొత్తగా తయారవుతున్న రోడ్లన్నీ 100 అడుగుల రోడ్లే. అనేక చిన్న గ్రామాలను అనుసంధానించడానికి మాస్టర్ ప్లాన్, ఉత్తర భారతదేశం నుంచి ఎయిర్ కార్గో డ్రాప్, దక్షిణాదికి సరఫరా గొలుసు కేంద్రంగా మార్చడానికి ప్రణాళికలు ఉన్నాయి’ అని వివరించారు.

కొచ్చికి చెందిన ఓ నెటిజన్.. ‘కొచ్చి కచ్చితంగా మీ అవసరాలకు సరిపోతుంది. కొచ్చిలో టాప్ 3 మినహా మరే ఇతర నగరాల కంటే మెరుగైన అంతర్జాతీయ కనెక్టివిటీ ఉంది. మంచి వసతులున్నాయి. మెట్రో కూడా ఉంది. కొంచెం తేమగా ఉన్నప్పటికీ 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండదు’ అని పేర్కొన్నారు.

ఇక టైర్-1 నగరాలకు సంబంధించి వచ్చిన సిఫార్సుల్లో హైదరాబాద్, పుణె ఉన్నాయి. “హైదరాబాద్ అద్భుతమైన అంతర్జాతీయ కనెక్టివిటీ కలిగి ఉంది. రాజధాని నగరం కావడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏడాదిలో తొమ్మిది నెలలపాటు అద్భుతమైన వాతావరణం. పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నారు కాబట్టి రాత్రి జీవితం చాలా బాగుంటుంది. అయితే, ముంబై లేదా బెంగళూరు అంత కాదు. మీరు స్థిరపడాలనుకునే ప్రదేశాల్లో రోడ్డు బాగుంటాయి.

వీటన్నింటికీ మించి.. అమెరికా నుంచి తిరిగి వచ్చి ఇక్కడ స్థిరపడినవారు భారీగానే ఉంటారు కాబట్టి.. కొత్త ప్రదేశంలో ఉన్నానే భావన మీకు ఎప్పుడూ రాదు’ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ‘ఆస్తి ధరలు ముంబై లేదా బెంగళూరు లాగా భారీగా ఉండవు. టెక్ హబ్ నుంచి 30 నిమిషాల దూరంలో ఉన్న ప్రదేశంలో చక్కని విల్లాను కొనుగోలు చేయడం లేద నిర్మించుకోవచ్చు’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. మరికొందరు పుణె మంచి నగరమని చెప్పారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles