poulomi avante poulomi avante

మామ‌య్య ఇల్లంటే మ‌స్తు ఇష్టం

  • రియల్ ఎస్టేట్ గురుతో నటుడు సుశాంత్

మన మదిలో అంతర్లీనంగా ఉన్న అంశాలే కలల రూపంలో కనిపిస్తాయి. మనం కల కన్న ప్రతిసారీ అది నేరుగా మనతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. మరి బాలీవుడ్ నటుడు సుశాంత్ అనుమోలు కూడా ఇలాంటి కలలు కంటారా? తన ఇల్లు ఎలా ఉండాలని ఆయన కలకన్నారు? ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ విషయంలో ఆయన తన అభిప్రాయాలను ‘రియల్ ఎస్టేట్ గురు’తో పంచుకున్నారు. కలల సౌథం ఎలా ఉండాలనే అంశం ఆయన సంపూర్ణత, వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. ‘నేను స్టేట్స్ లో ఉండేటప్పుడు చాలా అపార్ట్ మెంట్లలో అద్దెకు ఉన్నాను. అంతేకాకుండా నా ఇంటిని రీమోడలింగ్ కూడా చేయించాను. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక అంతస్తులో నివసిస్తున్నందున శాశ్వత ఇల్లు కొనాలని అనిపించలేదు.

అది నాకు చాలా ఉత్తమమైన అనుభూతి ఇస్తుంది’ అని తెలిపారు. తన మొదటి ఇల్లు గురించి, చిన్ననాటి సంగతులు గురించి ఆయన చాలా వివరించారు. ‘నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నాకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు అమ్మమ్మ ఇంట్లో పెరిగాను. అప్పుడు అన్నదమ్ములతో ప్రతిరోజూ పండగలా ఉండేది. అవన్నీ భలే పసందైన రోజులు’ అని సుశాంత్ పేర్కొన్నారు.

సొంతింటి కోసం కల కనడం చాలా సాధారణమైన విషయం. కానీ పూర్తిగా ప్రేమానురాగాలతో కూడిన ఇంటి కోసం కల కనడం నిజంగా ప్రత్యేకమే. సుశాంత్ లో ఉన్నది ఈ కోణమే అని మాటల సందర్భంగా ఆవిష్కృతమైంది. ఆయన కలల సౌథం తనలోని నటుడిని ప్రతిఫలించేలా ఉండాలనేది సుశాంత్ భావన. ఇంట్లోని వివిధ భాగాలు జీవితంలోని వివిధ భాగాలను సూచిస్తాయని అభిప్రాయపడ్డారు. ‘ఇళ్ల డిజైన్ సంప్రదాయంగా ఉంటే అభినందిస్తాను.

కానీ నా విషయానికి వచ్చేసరికి సమకాలీనంగా ఉండాలని కోరుకుంటాను. సౌకర్యవంతమైన కనీస డిజైన్ ను ఇష్టపడతాను. అంతేకాకుండా భారీ కిటికీలు, చక్కనైన సొగసు, శుభ్రతగా ఉండాలి. అదే సమయంలో పారిశ్రామిక ఇంటి వంటి రూపం వద్దు. కానీ చెక్కల వెచ్చదనం లోపల తెలియాలి. ప్రేమ, అసాధారణమైన డెకర్ తో నిండిన ఆధునికమైన ఇల్లు కావాలి. మీ ఇంటీరియర్ ను బయటకు తెలిసేలా చేసే ఓపెన్ కాన్సెప్ట్ లేఔట్ బావుంటుంది’ అని కాళిదాస్ ఫేమ్ వెల్లడించారు.

సుశాంత్ కొంతకాలం అమెరికాలో ఉన్నప్పుడు బహుముఖ అపార్ట్ మెంట్లలో నివసించారు. అనంతరం హైదరాబాద్ వచ్చాక సొంత బంగ్లాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రకాల ఇళ్లలో అనుకూలతలు, ప్రతికూలతలను గమనించారు. ఆ రెండింటి మధ్య పోలికలు చూపించారు. ‘రెండింటికీ వాటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. అయితే, నేను బంగ్లాలో నివసించడం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడూ నేను వ్యక్తిగత గోప్యత కోరుకుంటాను. నటుడు అయ్యాక ఇది మరీ ఎక్కువ అవసరం అయింది. ఈ ప్రపంచంలో డబ్బంతా నా దగ్గర ఉన్నప్పటికీ, మన కోరికలకు అంతం ఉండదు. కానీ మన ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. పొరుగువారితో కాలక్షేపాలకు దూరంగా కాస్త ప్రత్యేకంగా జీవించాలని అనుకుంటే బంగ్లా కొనుగోలు చేయడమే ఉత్తమం.

సహజమైన తోటల మధ్య ప్రశాంతంగా జీవించే అవకాశం లభిస్తుంది’ అని తెలిపారు. సొంతింటికి సంబంధించి తనకు ఓ కల ఉందని సుశాంత్ వెల్లడించారు. ఇరుగుపొరుగువారి కళ్లు, చెవులు పడని అందంగా అలంకరించిన స్వర్గం వంటి ఇల్లు కావాలనేది తన ఆకాంక్ష అని.. అది హైదరాబాద్ లో నెరవేరుతోందని వివరించారు. ‘ప్రస్తుతం నాకు ఉన్నదాంతో చాలా సంతృప్తిగా ఉన్నాను. ప్రత్యేకంగా ఒక కొలను, వ్యాయామ స్థలమే నా ప్రాధాన్యత. ఇంకా నా వ్యక్తిగత గోప్యత అధికంగా ప్రాధాన్యమిస్తాను. నా బంగ్లా నన్ను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ నివసించడం వల్ల నా సామాజిక హోదా కూడా పెరిగింది. బంగ్లాలోని నా వ్యక్తిగత అంతస్తులో ఎక్కువ సమయం గడపడం నాకు ఎంతో సంతృప్తి కలిగిస్తుంది’ అని తెలిపారు.

అందమైన హైదరాబాద్ కొండ మీద సుశాంత్ బంగ్లా ఉండటం అతనికి ఎంతగానో నచ్చే విషయం. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో టెర్రస్ పైకి వెళ్లి హైదరాబాద్ అందాలను ఆస్వాదిస్తూ తాజా గాలిని పీల్చుకోవడం చాలా ఊరటనిచ్చే అంశమని ఆయన వెల్లడించారు. ‘అక్కడ ఎంతో హాయిగా ఉంటుంది. అక్కడ అద్భుతమైన వాంటేజ్ పాయింట్ ఉంది. నేను నా పూర్తి జీవితాన్ని ఇక్కడే గడపగలను. ఇక్కడ బంగ్లా టౌన్ షిప్పులు మరింతగా రాబోతున్నాయి. వ్యక్తిగత గోప్యతను ఇష్టపడే మాలాంటి వారి కోసం సకల సౌకర్యాలతో కూడి బంగ్లాలు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారు’ అని సుశాంత్ పేర్కొన్నారు. నటుడిగా మారిన ఈ ఎలక్ట్రిక్ ఇంజనీర్ ఇంటి ప్లాన్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ‘చక్కని లైటింగ్ నాకు తప్పనిసరి. సాంకేతికత, ఆటోమేషన్ అనేవి నాకు చాలా ఇష్టమైన అంశాలు.

కామన్ ఏరియాల్లో కలిసి ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్థలాలు అవసరం’ అని అభిప్రాయపడ్డారు. సుశాంత్ ఇంటిని చూస్తే ఆయన చాలా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నారనే సంగతి అర్థమవుతుంది. ఎన్నో ఆధునికమైన అంశాల నుంచి ఆయన ప్రేరణ పొందుతున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ఇంటీరియర్ డిజైనర్ ను నియమించుకుంటున్నారా లేక సొంతంగానే ముందుకెళ్తున్నారా అని అడగ్గా.. ‘నా ఇంట్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే.. తప్పకుండా ఆర్టిటెక్ట్ సలహాలు తీసుకుంటాను. వారు కొత్త కొత్త ఆలోచనలతో వస్తుంటారు. దీంతో అన్ని అంశాలనూ వారితో కూలంకషంగా చర్చిస్తాను. ప్రతి ఒక్కరూ తమకు అనువైన, సౌకర్యవంతమైన ఇంట్లో జీవించడానికి అర్హులు’ అని పేర్కొన్నారు.

సెలబ్రిటీల్లో ఎవరి ఇల్లు ఇష్టమనే ప్రశ్న వేయగానే.. సుశాంత్ నోటి వెంట చాలామంది పేర్లు వచ్చాయి. అయితే, అన్నింటి కంటే అగ్రభాగాన ఉన్నది మాత్రం.. తన మేనమామ అక్కినేని నాగార్జున ఇల్లే. ‘మా మామయ్య ఇంటిని కట్టుకున్న విధానం నాకు ఎప్పుడూ నచ్చుతుంది. అదేమీ ప్రత్యేకమైనది కాదు. కానీ చాలా సమకాలీన అభిరుచులతో నిర్మితమైంది. ఇక రానా దగ్గుబాటి ఇల్లు కూడా నాకు నచ్చుతుంది. ఆయన తోట నుంచి లేక్ వ్యూ చాలా బాగుంటుంది. మన నగరంలో దాచి ఉంచిన రత్నల్లాంటి భవనాలు పుష్కలంగా ఉన్నాయని నాకు తెలుసు.

నేను నా ఇంటిని రీమోడలింగ్ చేయించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏ ఇంటికి వెళ్లినా నిమిషాల్లోనే ఆ ఇంటి వివరాలు సేకరించడం అలవాటైపోయింది. అది పొగమంచు ఫ్యాన్ కావొచ్చు.. సువాసన వెదజల్లే డిస్పెన్సన్ కావొచ్చు.. పెర్గోలా లేదా స్విమ్ స్పా.. ఇలా ఏదైనా సరే.. మీరు కళ్లు తెరిచి చూసేసరికి అక్కడ కొత్తదనం ఉంటుంది. ప్రజలు తమ సౌలభ్యం, అవసరాలను బట్టి నగరంలోని వివిధ ప్రాంతాలను ఎంపిక చేసుకుని నివసించడం బావుంది. నా స్నేహితులు చాలామంది గచ్చిబౌలి వైపు మారారు. అక్కడ నివసించడం చాలా సరదాగా ఉందని చెప్పారు’ అని సుశాంత్ ముగించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles