poulomi avante poulomi avante

హెచ్ఎండీఏ కాఫీ టేబుల్ బుక్!

హైద‌రాబాద్‌లోని ప‌చ్చ‌ద‌నం, చెరువులు, చిత్ర‌క‌ళ‌ల‌తో పాటు మ‌రిన్ని కీల‌క‌మైన అంశాల్ని వివ‌రిస్తూ హెచ్ఎండీఏ రూపొందించిన కాపీ టేబుల్ పుస్త‌కాన్ని మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల‌ ఆవిష్క‌రించారు. ఈ పుస్త‌కంలో సీఎం కేసీఆర్ కొన్ని ముఖ్య‌మైన విష‌యాల గురించి రాశారు. తెలంగాణ మున్సిపాలిటీల్లో పది శాతం సొమ్మును గ్రీన్ బడ్జెట్ గా కేటాయింపులు జరిపేలా మున్సిపల్ చట్టంలో పొందుపరిచామని దీంతో ప్రతి స్థానిక సంస్థల్లో ప్ర‌కృతివనం ఏర్పాటు చేసేందుకు వీలు లభించిందని సీఎం ముందు మాట‌లో పేర్కొన్నారు. పచ్చదనం, చెరువుల పరిరక్షణ అనేద పట్టణీకరలో భాగమని..

ఈ క్రతువులో హెచ్ఎండీఏ ముఖ్యభూమిక పోషించాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పచ్చదనాన్ని ఈ పుస్తకంలో ఆవిష్కరించారని మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. నగరం చుట్టూ పచ్చదనాన్ని పెంచేందుకు 16 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను హెచ్ఎండీఏ దత్తత తీసుకోవడం హర్షణీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ డ్రిప్ ఇర్రిగేషన్ విధానాన్ని అవలంభించామని, ఫలితంగా 19 ఓఆర్ఆర్ కూడళ్ల వద్ద పచ్చదనం విరివిగా పెరిగిందని పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.

 

CLICK HERE For PDF << HMDA Brings to the life Greenery, Lakes, Art and More In Hyderabad >>

పట్టణీకరణ వల్ల పచ్చదనం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కాంక్రీటు జంగిల్లా మారిన నగరంలో పచ్చదనాన్ని పరఢవిల్లేలా చేసేందుకై హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాలకు సరికొత్త జీవం తెచ్చే ప్రయత్నం ముమ్మరంగా చేస్తోంది. ప్రకృతిని మళ్లీ ప్రజల ముంగిట్లోకి తెచ్చేందుకు నడుం బిగించింది. పదిహేను వందల ఏళ్ల చరిత్ర గల భాగ్యనగరం ప్రపంచంలోనే అతివేగంగా డెవలప్ అవుతోంది. 2500 మిలియ‌న్ ఏళ్ల కింద‌ట ఏర్పడిన కొండ ప్రాంతాలు, బండరాళ్లు, నీటి సరస్సులు వంటివి నగరానికే సరికొత్త అందాన్ని తెచ్చాయి.

 

పట్టణీకరణ వల్ల వీటి ప్రాముఖ్యత తగ్గిపోతున్న తరుణంలో హెచ్ఎండీఏ ఒక అడుగు ముందుకేసింది. నగర వారసత్వ సంపదను పరిరక్షించే పనిలో నిమగ్నమైంది. చెట్లు, సరస్సులు, పచ్చదనాన్ని పరిరక్షిస్తోంది. చెట్ల పెంప‌కం, ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల రూపురేఖ‌ల్ని మార్చుతోంది. చెరువులు, స‌ర‌స్సులు, అట‌వీ ప్రాంతాల్ని ప‌రిర‌క్షించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. అంతేకాదు, ఔట‌ర్ రింగ్ రోడ్డుతో పాటు అక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌న్నింటినీ హ‌రిత‌మ‌యంగా చేస్తోంది. క‌ళాత్మ‌క చిత్రాల‌తో స‌రికొత్త రీతిలో ముస్తాబు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఈ క్ర‌మంలో గ‌త కొంత‌కాలం నుంచి ఓఆర్ఆర్‌ను అందంగా తీర్చిదిద్దిన విధానాన్ని ఈ పుస్త‌కంలో పొందుప‌ర్చింది.

 

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles