రియల్ ఎస్టేట్ గురు ప్రత్యేక ఇంటర్వ్యూ
తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అదాశర్మ ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి గురించి ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. తన బాల్యమంతా గడిపిన ఇంట్లోనే ప్రస్తుతం నివసిస్తోంది. అందుకే, ఆ ఇంటితో అమెకు ఎనలేని బంధం నెలకొందని, అనేక మధురస్మృతులున్నాయని చెబుతోంది.
నేను ఈ ఇంట్లోనే పెరిగాను. ఇదీ నా కలల గృహమే. పైగా, నేను చదువుకున్న స్కూలు మా ఇంటికెంతో దగ్గరగా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను. అందుకే అప్పుడప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటాను. ఇల్లంటే కేవలం నాలుగు గోడలే కాదని.. మనకు నచ్చిన వాళ్లంతా చుట్టుపక్కల ఉండే ప్రాంతమని భావిస్తాను. ఆరంభంలో స్కూలుకెళ్లి ఇంటికి రావడం, వేసవి సెలవులకు వెళ్లి మళ్లీ రావడమనేది జరిగేది. కొంతకాలం నుంచి వృత్తిరీత్యా ప్రస్తుతం నేను, అమ్మ హోటల్ రూముల్లో ఉండాల్సి వస్తోంది. అది కూడా నాకు నచ్చిన ప్రదేశమేనని భావిస్తాను.
ఆమె హృదయంలో చెక్కిన చాలా పదునైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘ఎంత ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అంత సంపన్నులు కారని.. ఇతరులతో ఎంత పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే అంశం మీదే మీరెంత సంపన్నులో అర్థమవుతుంద’’ని అర్థమైంది. ఈ పదునైన మాటల్ని అమె మర్చిపోలేకపోతోంది. అందుకే ఆమె ఎక్కడున్నా, ఎప్పుడైనా సంపన్న జీవితాన్ని గడుపుతుంది. ఫలితంగా, విలాసవంతమైన నివాసాన్ని కట్టుకోవడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
అలాంటి ఇళ్లు వద్దు..
‘ఆడంభరమైన గృహాలు నన్ను కలవరపెడతాయి. ఎందుకంటే, వాటిని మెయింటెయిన్ చేయడమంటే ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమే. ఏదైనా ఒక గృహాన్ని సందర్శించడం మెరుగ్గానే అనిపిస్తుంది. అందులో పూర్తి ఖాళీలు నన్ను సమూలంగా ఆకర్షిస్తాయి. భారీ ఖాళీగా ఉండే గృహం విపరీతమైన ఆనందాన్నిస్తుంద’ని తెలియజేసింది. ఆమె అప్పటికే తన కలల గృహంలో నివసిస్తోంది. అందులో పెద్ద కిటికీలు ఉన్నాయని, ప్రతిరోజు కాఫీ సేవించేటప్పుడు అనేక పక్షులు మరియు జంతువులు కనిపించే కృత్రిమ అడవిని చూసి ఆస్వాదిస్తానని చెబుతోంది.
ఆమె ఎల్లప్పుడూ తనకు నచ్చిన గృహాన్ని అడవి మధ్యలో లేదా ఇంటి ఎదురుగా ఉండాలని కోరుకుంటుంది. పర్వతాల ఎదురుగా ఉన్నా ఫర్వాలేదని అంటోంది. ఇలా, ప్రపంచంలో ఎక్కడున్నా తనకు ఓకే అంటోంది. కాకపోతే, ఇంటికి అతిపెద్ద కిటికీలుండాలని కోరుకుంటోంది. ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. కనీస స్థాయిలో ఉంటే సరిపోతుందని చెబుతోంది. ప్రస్తుతం తమ ఇంట్లో భారీ ఫర్నీచర్ లేదని.. ఇంట్లో కింద కూర్చోవడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుందన్నారు. ’’గత ఏడాది నుంచి నేల మీద నిద్రపోతున్నాను. ఫలితంగా శరీరం మెరుపుతీగలా మారింది. నేను నటిని కాబట్టి నిరంతరం ప్రయాణిస్తుంటాను. అందుకే, ఎక్కడున్నా.. ఏ ప్రాంతాన్ని అయినా కలల ప్రదేశంగా మార్చేసుకుంటాను. వృత్తిరీత్యా బయటికొస్తే ఇంటి మీద బెంగ ఏర్పడుతుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఈమధ్య హోటల్‌నే సొంత ఇల్లుగా మార్చేసుకున్నాను. అందుకే యోగా చాప, హులా-హూప్ వంటివి నాతో పాటే ఉంచుకుంటాన’’ని గట్టిగా నవ్వేసిందీ ముద్దుగుమ్మ.