Categories: Rera

రెరాలో ఏజెంట్లు రిజిస్ట‌ర్ కావాలి

పిలుపునిచ్చిన రెరా ఛైర్మ‌న్‌
డాక్ట‌ర్ ఎన్ స‌త్య‌నారాయ‌ణ‌

రియ‌ల్ రంగంలో లావాదేవీల‌ను నిర్వ‌హించే ఏజెంట్లంద‌రూ రెరాలో న‌మోదు కావాలని.. కొనుగోలుదారులు మోసానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్య‌త రెరా ఏజెంట్ల‌దేన‌ని టీఎస్ రెరా ఛైర్మ‌న్ డాక్ట‌ర్ ఎన్ స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో సీడీఎంఏ కార్యాలయంలో జ‌రిగిన ఏజెంట్ల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌మ వ‌ద్ద రిజిస్ట‌ర్ చేసుకునే ఏజెంట్ల‌కు 48 గంటల్ల రిజిస్ట్రేష‌న్ ప‌త్రాన్ని అంద‌జేస్తామ‌ని తెలిపారు. బిల్డర్లు, ప్రమోటర్లు త్రైమాసిక వార్షిక నివేదికల‌ను సకాలంలో పంపేలా ఏజెంట్లు బాధ్యత తీసుకోవాలని కోరారు. త్రైమాసిక, వార్షిక నివేదికలు సమర్పించని ప్రాజెక్టులకు ఇటీవల షోకాజు నోటీసులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. రెరా స‌భ్యుడు కె.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఏజెంట్లు కొనుగోలుదారులకు సక్రమమైన సమాచారం అందించాలన్నారు. సదరు ప్రాజెక్టుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మ‌రో సభ్యుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఏజెంట్లను మరింత బలోపేతం చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను సాధించ‌వ‌చ్చ‌ని తెలిపారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు ఏజెంట్లకు పరీక్ష

This website uses cookies.