నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పింక్, మిడిల్ క్లాస్ అబ్బాయి, డార్లింగ్స్ వంటి పలు చిత్రాల్లో తన నటన ద్వారా పేరు పొందారు. ఇక నటి తమన్నాను వివాహం చేసుకుంటున్నట్టు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు. జంతు ప్రేమికుడు, ముఖ్యంగా కుక్కలను అమితంగా ఇష్టపడే విజయ్ వర్మ.. ముంబైలోని తన ఇంటికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. గత ఏడాదిన్నరగా ఆయన అందులోనే ఉంటున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాదాపు పదేళ్ల కాలంలో 14 ఇళ్లు మారారు. ప్రస్తుతం ఆయన ఇల్లు ముంబై జుహూ వెర్సోవా లింక్ రోడ్డులో ఉంది. ఇంట్లో ఆయనకు ఇష్టమైన ప్రదేశం. కాఫీ స్పాట్. లాంజ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ ప్లేస్ కాదు. కానీ అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేశారు. కిటికీకి ఎదురుగా పసుపు రంగు సోఫాతో ఆ ప్లేస్ ఉంటుంది. అక్కడ కూర్చుని కిటికీలో నుంచి చూస్తే నేరుగా సముద్రం కనపడుతుంది. చుట్టూ పచ్చదనం ఉండటంతో ధారాళమైన గాలి లోపలకు వస్తుంది.
‘నేను చాలా నెలలుగా ఇళ్లు చూశారు. కానీ ఈ ఇల్లు చూడటానికి చాలా సమయం పట్టింది. సరైనది దొరికే వరకు నేను ఎదురుచూస్తూనే ఉంటాను. ఈ ఇల్లు చాలా ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. గాలి, వెలుతురు ధారాళంగా లోపలకు వస్తాయి. ప్రతి గదిలోకీ సహజమైన వెలుతురు వస్తుంది. అలాగే ఈ ఇంట్లోని ప్రతి గదిలోనుంచి సముద్రం కనపడుతుంది’ అని విజయ్ వర్మ వివరించారు. ఇంట్లో ఏ మూల కూర్చున్నా పచ్చదనం, నీరు, తాజాగాలి రావాలని ఆయన కోరుకుంటారు. అద్దెకు ఉంటున్న ఈ అపార్ట్ మెంట్ కు తన అభిరుచికి అనుగుణంగా మార్చుకున్నట్టు చెప్పారు. ఆయన ఇంట్లో ఓ పెద్ద ఆకుపచ్చ తలుపు ఉంది. దానిపై బ్యాట్ మన్ పోస్టర్ ఉంది. బ్యాట్ మన్ సిరీస్ కు ఆయన ఎంత పెద్ద అభిమాని అనేది ఆ పోస్టర్ చూస్తే తెలుస్తుంది.
విజయ్ వర్మ ఇంట్లో ‘విజయ్ కార్నర్’ ఉంటుంది. అందులో తన జీవితంలో తారసపడిన వ్యక్తులు ఇచ్చిన పోస్టర్లు, ఫొటోలు ఉంటాయి. ఇది చాలా ఆసక్తికరంగా కనిపిస్తంది. గల్లీ బాయ్ విజయం తర్వాత అమితాబ్ నుంచి ఆయనకు లేఖ వచ్చింది. ‘ఆయన నాకు ఓ పుష్పగుచ్ఛం, చేతితో రాసిన లేఖ పంపించారు. అప్పటి నుంచి నేను ఆడిషన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నా’ అని విజయ్ వివరించారు. ఇక విజయ్ తన బూట్ల కోసమే ఓ గది ఏర్పాటు చేసుకున్నారు. నైక్ నుంచి జోర్డాన్ వరకు అన్ని బ్రాండ్ల షూస్ ఉంటాయి. అలాగే అనురాగ్ కశ్యప్ ఓ జత షూలను విజయ్ కు బహుమతిగా ఇచ్చారు. విజయ్ పెద్ద పోలరాయిడ్ వ్యక్తి కూడా. అందుకే ఆయన కలిసి పనిచేసిన ఆసక్తికరమైన వ్యక్తుల ఫొటోలు సేకరిస్తుంటారు. ఆయన ఎక్కడకు వెళ్లినా వెంట పోలరాయిడ్ ఉండాల్సిందే.
This website uses cookies.